ఏపీ రోడ్ల వైభోగం చూడ తరమా..!

Publish Date:Jul 18, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై తెలుగుదేశం, జనసేన ప్రారంభించిన డిజిటల్ క్యాంపెయిన్ కు బ్రహ్మాండమైన స్పందన వస్తోంది. చెత్త రోడ్లు.. చెత్త సీఎం అంటూ తెలుగుదేశం, గుడ్ మార్నింగ్ సిఎం సర్ అంటూ జనసేన రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించిన సంగతి తెలసిందే. వారి క్యాంపెయిన్ కు మద్దతుగా నెటిజనులు సైతం ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిపై సామాజిక మాధ్యమంలో వ్యంగ్య కార్టూన్లు, వ్యాఖ్యలతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ పోస్టులన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనాలను ఆకర్షిస్తున్నాయి. సామాన్య జనులు సైతం రోడ్ల దుస్థితిపై వాస్తవ పరిస్థితికి సామాజిక మాధ్యమం అద్దం పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అద్దాల్లా ఉన్నాయని అధికార పార్టీ కొన్ని ఫొటోలు పెట్టి సొంత భుజాలను తడుముకుంటోంది. అదే సమయంలో రోడ్ల దుస్థితిపై ప్రతిపక్షాల విమర్శలపై మండి పడుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఏపీలోని రోడ్ల బండారాన్ని సామాజిక మాధ్యమం సాక్షిగా బట్టబయలు చేసేశారు. రోడ్ల పరిస్థితిపై వ్యంగ్య బాణాలు సంధిస్తూ ప్రభుత్వ నిర్వాకాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.  వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. చూడగానే ఆకట్టుకునే కార్టూన్లతో సామాజిక మాధ్యమాన్ని హోరెత్తిస్తున్నారు. రోడ్ల దుస్థితిపై నెటిజన్ల పోస్టులు ఇప్పడు సమాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. దీనిపై సామాన్యులు సైతం స్పందిస్తున్నారు. 

 పెద్ద పెద్ద గోతులతో ఛిద్రమైన రహదారుల చిత్రాలు, వీడియోలకు బలమైన పంచ్ డైలాగులతో... సినిమాలలోని చిత్రాలతో కూడిన మైమ్ లను జోడించి నెటిజన్లు చేస్తున్న పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  గుడ్ మార్నింగ్ సీఎం సర్ అంటూ జనసేన ప్రారంబించిన హాష్ ట్యాగ్ డిజిటల్ క్యాంపైన్ విపరీతంగా  పాపులర్ అయ్యింది. అలాగే తెలుగుదేశం  సోషల్ మీడియా వేదికగా చేస్తున్నప్రచారానికీ ప్రజా స్పందన అమోఘంగా ఉంది. రాష్ట్ర రహదారులపై రాజమహేంద్ర వరంలో ఒక కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

అలాగే ఏప్రిల్ 19న మంత్రి కేటీఆర్ ఏపీ రోడ్లపై చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాలలోనూ సంచలనం సృష్టించాయి. కేటీఆర్ వ్యాఖ్యలకు నొచ్చుకున్న వైకాపా నేతలు తెలంగాణలో రోడ్లు, కరెంట్ పరిస్థితులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఎంతగా ఎదురుదాడి చేసినా కేటీఆర్ ఏపీ రోడ్లపై చేసిన వ్యాఖ్యలకు వచ్చినంత స్పందన వైసీపీ నేతల విమర్శలకు రాలేదు. అసలు వైసీపీ విమర్శలను రెండు రాష్ట్రాలలో కూడా పట్టించుకున్న నాథుడే లేకపోయాడు.

ఆ వ్యాఖ్యలను బేస్ గా చేసుకుని ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వ్యంగ్య వైభోగం సామాజిక మాధ్యమంలో బ్రహ్మాండంగా పేలుతోంది. జగన్ నిర్వాకం వల్ల ఏపీలో కార్లు, బైకుల మెకానిక్ లు బాగుపడుతున్నారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.  రాష్ట్రంలో జులై 15నాటికి రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండకూడదు అంటూ జగన్ ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపైనా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.  

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.