స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయలి : నారా లోకేష్

Publish Date:Jul 30, 2026

Advertisement

 

 రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కోరారు. ఆదోని మండల, పట్టణ టీడీపీ ముఖ్యనేతలతో నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... చిన్నచిన్న విభేదాలను పక్కనబెట్టి కూటమి నేతలు, కార్యకర్తలను కలుపుకెళ్లాలని అన్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై డోర్ టు డోర్  కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించండి. మండల, క్లస్టర్, యూనిట్ ఇంచార్జిలు చురుగ్గా పనిచేయాలి. పనిచేసే వాళ్ళని గౌరవిస్తా. పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే సహించేది లేదు.

 ఏవైనా సమస్యలు ఉంటే ఇంచార్జితో మాట్లాడండి. నాలుగు గోడల నడుమ కలసి కూర్చొని సమస్య పరిష్కరించుకోండి. మీడియాకి ఎక్కితే పార్టీ నష్టపోతుంది. రెవెన్యూ, పోలీసు సమస్యలు, జీ రామ్ జీ బిల్లుల సమస్యలపై అధికారులకు ఆదేశాలు ఇస్తాం. 2014-19 నడుమ హౌసింగ్ బిల్లుల సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడి, విడతలవారీగా చెల్లించేలా కృషిచేస్తా. కూటమి ధర్మాన్ని పాటిస్తూ కలసికట్టుగా పని చేయాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో జోనల్ ఇంచార్జి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలు కిస్టమ్మ, నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కేశవరెడ్డి, ఆదోని పట్టణ పార్టీ అధ్యక్షుడు బి.తిమ్మప్ప, మండల పార్టీ అధ్యక్షుడు కురువ శివప్ప, జిల్లా పార్టీ ట్రెజరర్ వాల్మీకి రవి, ఆదోని టీడీపీ నాయకులు బి. కృష్ణయ్య, లక్ష్మీనారాయణ, బి. విరూపాక్షి, సజ్జాద్ హుసేన్, కొల్లా వీరేష్, రామాంజని, ఎస్.సయ్యదుల్లా,  బిపి బస్వరాజ్, కురువ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Nara Lokesh, Adoni, TDP intimate meeting, CM Chandrababu, Election of local bodies, MLA Palla Srinivasa Rao

By
en-us Political News

  
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.