విజయవాడలో పొలిటికల్ హీట్... కేసినేని నాని అడ్డాలో నాయుడుగారి కోడలు?

Publish Date:Feb 13, 2023

Advertisement

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు కోడలు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ అయ్యిందా? వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా.. పార్లమెంటు స్థానాలలో కూడా విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న చంద్రబాబు నాయుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలోనూ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తి చేసేశారన్న టాక్ పార్టీ వర్గాలలో జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఎంత ముఖ్యమో, అత్యధిక లోక్ సభ నియోజకవర్గాలలో విజయం సాధించి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను సంపూర్ణంగా సాధించడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అదేమంత కష్టసాధ్యం కాదని ఆయన భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో విజయం నల్లేరు మీద బండినడకేనని ఆయన అంచనా వేస్తున్నారు.

అధికార వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా..  జగన్ సర్కార్ పై ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా అన్ని వర్గాలూ తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతాయన్న విశ్వాసం ఆయనలోనే కాదు, తెలుగుదేశం శ్రేణుల్లోనూ వ్యక్తం అవుతోంది. దానికి తోడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ శపథం కూడా తెలుగుదేశం పార్టీకే ప్రయజనకరంగా పరిణమించనున్నది. జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తు ఇప్పటికే ఖాయమైందనీ, అధికారిక ప్రకటన లాంఛనమేననీ భావిస్తున్న వేళ.. చంద్రబాబు లోక్ సభ నియోజకవర్గాలపై కూడా దృష్టి పెట్టారని చెబుతున్నారు. కచ్చితంగా గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇచ్చేందుకు నిర్ణయించుకున్న చంద్రబాబు రాష్ట్రంలోని పాతిక లోక్ సభ నియోజకవర్గాలలో 24 నియోజకవర్గాలపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. అయితే కీలకమైన విజయవాడ లోక్ సభ స్థానం విషయంలోనే ఆయన ఒకింత ఇబ్బంది ఎదుర్కొంటున్నారనీ, ఆ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో కేశినేని బ్రదర్స్ మధ్య విభేదాలు ప్రతిబంధకంగా మారాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గత ఎన్నికలలో విజయవాడ ఎంపీగా ఎన్నికైన కేశినేని నాని, ఈ సారి ఎన్నికలలో ఆ సీటు కోసం పోటీ పడుతున్న ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ ల మధ్య సయోధ్య సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడం.. విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో చంద్రబాబుకు తలనొప్పులు తప్పడం లేదంటున్నారు. కేశినేని నాని వ్యవహార శైలి పార్టీని ఇబ్బందుల పాలు చేస్తున్నది. అదే సమయంలో ఆయన సోదరుడిని ప్రోత్సహించి టికెట్ ఇచ్చినా.. కేశినేని నాని సహకారం లేకుంటే విజయం సాధించే అవకాశం లేదు. అలాగని కేశినేని నానికి టికెట్ ఇచ్చినా ఆయన సోదరుడి సహకారం అవసరం. వీరిద్దరినీ కాదని కొత్త వారిని ఎంపిక చేస్తే.. అన్న ఆలోచనే నారా బ్రాహ్మణి పేరును తెరమీదకు తెచ్చిందంటున్నారు.

నారా బ్రాహ్మణిని విజయవాడ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే కేశినేని బ్రదర్స్ ఇద్దరూ మారు మాట్లాడకుండా అంగీకరిస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే కేశినేని నాని తనకు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా.. తన సోదరుడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వడానికి వీల్లేదని పేర్కొన్న సంగతిని ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. అందుకే నారా బ్రాహ్మణిని విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే కేశినేని  బ్రదర్స్ ఇద్దరూ పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేస్తారని, అదే సమయంలో బ్రాహ్మణి ఎంట్రీ పార్టీకి కొత్త జోష్ తీసుకు వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తే  టీడీపీకి మరింత ఊపు వస్తుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. 
 
 పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, జనసేనాని పవన్ కల్యాణ్ ల సినిమా గ్లామర్ కు ఎన్టీఆర్ మనవరాలు బ్రాహ్మణి ఎంట్రీ మరింత బలం చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  ఇప్పటికే పార్టీ అధినేతగా చంద్రబాబు ప్రజాక్షేత్రంలో జగన్ పాలనా వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఆయన కుమారుడు లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతున్నారు. ముందు ముందు (పొత్తు కుదిరితే) పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కూడా తెలుగుదేశం గ్రాఫ్ ను మరింతగా పెంచేస్తుంది. ఇక విజయవాడ లోక్ సభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగితే ఇటు అసెంబ్లీ, అటు లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం స్వీప్ చేయడం ఖాయమని పార్టీ శ్రేణులు అంటున్నాయి.  

అదే విధంగా బ్రాహ్మణి లాంటి విద్యావంతురాలు లోక్ సభలో తెలుగుదేశం సభ్యురాలిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా గళం వినిపిస్తారని తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి. ఏతా వాతా వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంతో పొత్తు కుదిరితే బ్రాహ్మణికి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.