జర్నలిస్ట్ మాధ్యూకు నమస్తే .. క్షమాపణ

Publish Date:Oct 8, 2022

Advertisement

అదేదో టీవీ చానల్ లో,  ‘నా షో నా ఇష్టం’ అంటూ కమెడియన్ చంటి ప్రెజంట్ చేసే కామెడీ షో ఏదో వచ్చింది. జనం కూడా ఆ షోను బానే ఎంజాయ్ చేసినట్లున్నారు. అవును, అదో కామెడీ షో కాబట్టి, జనం చూసినా, చూడక పోయినా, ఎంజాయ్ చేసినా చేయక పోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు.  కానీ అదే పని రాజకీయ పార్టీలు నాయకులు  అదే తరహాలో  ‘నా పత్రిక నా ఇష్టం’ అంటే కుదరదు.  నా పత్రికలో నా ఇష్ట మొచ్చింది రాసుకుంటానంటే అసలే కుదరదు. ముఖ్యంగా. మీడియా మూడో కన్నుగా సోషల్ మీడియా కన్ను తెరిచిన తర్వాత  సొంత పత్రికలలో పార్టీల నేతలు  సోత్కర్షలకు దిగితే, ఇదిగో ఇలాగే నవ్వులపాలు కావలసి వస్తుంది.  క్షమాపణలు చెప్పుకోవలసి వస్తుంది. 
ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది  తెరాస/ భారాస అధికార పత్రిక (మౌత్ పీస్), ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక, నమస్తే తెలంగాణ పత్రిక  గురించే అయినా ఒక్క తెరాస మాత్రమే కాదు, ఒక్క నమస్తే, అనే కాదు.. చాలా వరకు రాజకీయ పార్టీలు సొంత పత్రికలు, సొంతగా టీవీ చానల్స్ పెట్టుకుంటున్నాయి. కాదంటే, సొంత పత్రికలు, సొంత ఛానల్స్ కంటే ఎక్కువగా తమను భుజాలకు ఎత్తుకునే పత్రికలు, మీడియా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అందువలనే  చాలా కాలం కిందటే  మహాకవి శ్రీశ్రీ  అంతటివాడు,  ‘పెట్టుబడి దారులకు పుట్టిన విష పుత్రికలు మన పత్రికలు’ అన్నారు.  ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి పత్రికలు అన్నీ అని అనలేము కానీ, చాలా వరకు  రాజకీయ బేహారుల చేతుల్లోకి వెళ్లి పోయాయి అనుకోండి వేరే విషయం..
ఇక అసలు విషయంలోకి వస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చురకైన పాత్రను పోషించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరులో   అడ్డుగా ఉన్న తెలంగాణ పదాన్ని చెరిపేసి, భారతీయను చేర్చిన సందర్భంగా, తెరాస అధికార పత్రిక నమస్తే తెలంగాణ  బీఆర్ఎస్ పట్ల దేశ విదేశాల ప్రముఖుల స్పందనలను సేకరించి ప్రచురించింది. సరే  ఆ ప్రచురించేది ఏదో ఉన్నది ఉన్నట్లుగా, చెప్పింది చెప్పినట్లుగా ప్రచురిస్తే  ఎవరికీ ఏ అభ్యంతరం ఉండక పోవును. కానీ  రాజును మించిన రాజభక్తి చూపించే క్రమంలో కావచ్చు  నమస్తే తెలంగాణ  పత్రికలో పనిచేసే చేయి తిరిగిన సంపాదక రచయితలు కాళిదాసు కవిత్వం  కొంత, తమ పైత్యం కొంత అన్నట్లుగా తమ పాండిత్యాన్ని కలిపి కథలు, ఇంటర్వ్యూలు ప్రచురించారు. అందులో భాగంగా ఈ దేశాన్ని ఒక్క కేసీఆర్  తప్ప ఇంకెవరు  రక్షించలేరనే అభిప్రాయం వ్యక్త పరిచినట్లు పేర్కొంటూ  కొందరు ప్రముఖుల ‘ఇంటర్వ్యూ’ ప్రచురించారు. 

ఇలా వచ్చిన ఇంటర్వ్యూలలో న్యూడిల్లీలో  ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు లిజ్ మాథ్యూ కూడా ఉన్నారు.  అయితే తన ఫోటోతో సహా వచ్చిన ఇంటర్వ్యూ  చూసిన  ఆమె ఆశ్చర్యపోయారు. తాను అనని మాటలను తన నోట్లో ఎలా పెడతారని  చాలా సీరియస్ గా రీయాక్ట్ అయ్యారు.  నమస్తే తెలంగాణ తప్పుడు రాతలను ఖండిస్తూ ట్వీట్ చేశారు. రాజకీయాల్లో ఎవరైనా పార్టీలు పెట్టవచ్చని మాత్రమే తాను చెప్పానని స్పష్టం చేశారు.

మాములుగా అయితే  నమస్తే ఇలాంటి ట్వీట్లను పట్టించుకోకపోయేదేమో కానీ  మాథ్యూ ఘాటుగా లేఖ రాయడంతో, తప్పనిసరై క్షమాపణ ప్రచురించింది.  అయితే, నమస్తే తెలంగాణ ఇలా తప్పులో కాలేయడం ఇదే మొదటి సారి కాదు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల రైతులు, గ్రామ సర్పంచ్ లు తెలంగాణలో అమలవుతున్న పథకాలను మెచ్చుకుంటున్నారని, తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నారని ఇలాగే పేర్లు, ఫోటోలు పెట్టి కధనాలు ప్రచురించింది.

అప్పట్లోనూ అక్కడి రైతులు ఎవరి ఫోటోలను అయితే పత్రిక ప్రచురించిందో ఆ సర్పంచులు ఆ వార్తలను ఖండించారు.  నమస్తే తెలంగాణ పత్రికను తగల పెట్టి మరీ తమ  నిరసన తెలిపారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు వలన తమ పంటపొలాలు నీటి మునిగి తాము  నష్ట పోతున్నామని  కేసేఆర్ ప్రభుత్వం ఫై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే  ఇతర పత్రికలు కూడా కొంతవరకు తప్పుడు రాతలకే ఎక్కువ ప్రాధన్యత ఇస్తున్నా, నమస్తే తెలంగాణ  పత్రిక ముఖ్యంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూపు తిప్పిన తర్వాత ఈ దేశాన్ని రక్షించేందుకు పుట్టిన మహా పురుషునిగా వర్ణించే కథలు, కథనాలు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు.  

అయితే, తుమ్మి తధాస్తు అనుకున్నట్లుగా ఇలా వరసగా తప్పుడు కథనాలు ప్రచురించి, క్షమాణలు చెప్పుకుంటూ పొతే, చివరకు ఆపత్రికలో వచ్చే నిజాలను కూడా ప్రజలు నమ్మడం మానేస్తారు. నిజానికి, ఇప్పటికే నమస్తే పత్రికను తెలంగాణ ప్రజలు అంతగా నమ్మడం లేదని అంటున్నారు.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.