అసంతృప్తిని మంత్రి పదవిపై ఆశ మింగేసిందా?

Publish Date:Sep 12, 2022

Advertisement

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో అంతగా పరిచయం అక్కర్లేని పేరు.ఉమ్మడి నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే. గత కొంత కాలంగా ఆయన వైసీసీ కార్యక్రమాలలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. జగన్ కేబినెట్ లో చోటు లభించలేదన్న అసంతృప్తే అందుకు కారణమని వైసీపీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరాఖరికి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి చేతులు కాల్చుకున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి తూతూ మంత్రంగానే పాల్గొన్నారు.

 వైఎస్  మరణం తర్వాత...  జగన్ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి సొంతంగా ... వైసీపీని స్థాపించిన సమయంలో  నెల్లూరు జిల్లా నుంచి జగన్ పార్టీలో చేరిన తొలి నేతనల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. దాంతో జగన్ ఆయనకు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.  అయితే తరువాత ఆ బాధ్యతల నుంచి ప్రసన్నకుమార్ రెడ్డిని తప్పించి  కాకాణి గోవర్థన్ రెడ్డికి   అప్పగించారు. సరే ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ తొలి కేబినెట్ లో స్థానం ఆశించారు. కానీ భంగపడ్డారు. ఆ భంగపాటును ఎలాగోలా ఓర్చుకున్నా మూడేళ్ల తరువాత జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కూడా తనకు మంత్రిపదవి దక్కకపోవడంతో నొచ్చుకున్నారు.  తనకు మంత్రి పదవి దక్కక పోవడం కంటే జిల్లాలో తన కంటే జూనియర్లు..  సబ్ జూనియర్లు అయిన.. మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లకు తొలి కేబినెట్‌లో చోటు దక్కడం.. అలాగే కాకాణి గోవర్థన్ రెడ్డికి జగన్ మలి కేబినెట్‌లో బెర్త్ కేటాయించడం  ప్రసన్న కుమార్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని పార్టీ శ్రేణులే చెబుతుంటాయి.

ఆ అసంతృప్తి కారణంగానే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతుంటాయి. అయితే హఠాత్తుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్క సారిగా జగన్ ను ఆకాసానికి ఎత్తేస్తున్న చందంగా ప్రశంసల వర్షం కురిపించారు. ఏకంగా సీఎం జగన్ ది ప్రధాన మంత్రి స్థాయి అని పొగిడేశారు. రాష్ట్ర ప్రజలు ఆయనే మరో సారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటూ చేసిన ప్రకటన పార్టీ శ్రేణులనే నివ్వెర పరిచింది. ఇంత కాలం పార్టీలో అసమ్మతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హఠాత్తుగా యూటర్న్ తీసుకుని జగన్ పై పొగడ్తల వర్షం కురిపించడమేమిటా అని ఆశ్చర్య పోయారు. కాగా ప్రసన్న కుమార్ రెడ్డి హఠాత్తుగా జగన్ మీద ప్రశంసల వర్షం కురిపించడానికి ఆయన త్వరలో మరోసారి తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలన్న నిర్ణయం తీసుకోవడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రసన్నకుమార్ రెడ్డి తూతూ మంత్రంగా పాల్గొనడంపై   తాడేపల్లి ప్యాలెస్ నుంచి గట్టిగానే మందలింపులు అందినా కూడా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆసక్తి చూపని ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా జగన్ పై ఎక్కడ లేని అభిమానాన్నీ ఒలకబొస్తూ పొగడ్తల వర్షం కురిపించడానికి కారణం ఆయనలో చిగురించిన మంత్రి పదవి ఆశేనని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల కేబినెట్ సమావేశం సందర్భంగా సీఎం జగన్ మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. పార్టీపైనా, తన కుటుంబంపైనా  ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు ఆరోపణలు సంధిస్తున్నా మంత్రులు స్పందించడంలేదని జగన్ ఫైర్ అయ్యారు.  తన తొలి కేబినెట్‌లో మంత్రులు   చలాకీగా ఉండేవారని చెబుతూ,  కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్,  కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్లు ప్రస్తావించారు. అదే సందర్భంగాఇప్పటికైనా మంత్రులు తీరు మార్చుకోకుంటే పదవులు పీకేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అదిగో ఆ హెచ్చరికతోనే రాష్ట్రంలో జగన్ తన కెబినెట్ ను మరో సారి పునర్వ్యవస్థీకరిస్తారనే  టాక్ జోరందుకుంది. ఈ నేపథ్యలోనే ప్రసన్నకుమార్ రెడ్డి యాక్టివ్ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంత్రి పదవిపై ఆశ ప్రసన్న కుమార్ రెడ్డిలోని  అసంతృప్తిని మింగేసిందని అంటున్నారు. 

By
en-us Political News

  
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.