Publish Date:Mar 30, 2025
ఎపిలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పల నాయుడు తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక సేద్యం చేశారు. శ్రీకాకుళం జిల్లారణ స్థల మండలంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఎంపీ ఎద్దులు, నాగలికి పూజ చేసి భూమిని దున్నారు. రైతులు అనాదిగా చేసే ఏరువాక సేద్యం ప్రతీ యేడు ఉగాది రోజు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎంపి ఆకాక్షించారు. రైతు కుటుంబాల కోసం కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mp-kalisetti-appalanaidu-yeruvaka-plantation-25-195282.html
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. చిన్న కొడుకు మార్క్ శంకర్ తాను చదువుతున్నపాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. కాళ్లు, చేతులకు కాలిన గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్ల వ్యవస్థ జగన్ కోసం జగన్ చేత జగనే సృష్టించుకున్న వ్యవస్థ. అలాంటి వ్యవస్థను జగన్ గాలి కొదిలేశారు. తన కోసం పని చేయడం తప్ప వలంటీర్లకు ఉద్యోగ భద్రత అన్నది లేకుండా చేశారు. వైసీపీ హయాంలో అమలులోకి వచ్చిన ఈ వలంటీర్ల వ్యవస్థ గ్రామాలు, పట్టణాల్లో సంక్షేమ పథకాల అమలులో జగన్ హయాంలో కీలక భూమిక పోషించింది.
ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీల చీఫ్ దాది రతన్ మోహిని ఇక లేరు. ఆమె వయస్సు వంద సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఏప్రిల్ 8) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు.
చత్తీస్ ఘడ్ లో వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా తాజాగా మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేశారు. ఆదివాసీలను ఇన్ ఫార్మర్లుగా చేసుకుని ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రప్రభుత్వం జల్లెడపడుతుంది.
ఎపి రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వంత ఇల్లు శంఖు స్థాపన కార్యక్రమం మంగళవారం (ఏప్రిల్ 9) జరుగనుంది. గత ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేనివంశీకి మరో మారు షాక్ తగిలింది. కస్టడీ ముగియడంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యేను ప్రత్యేక న్యాయస్థానం ఎస్ సి ఎస్ టి కోర్టులో హాజరుపరిచారు.
త్వరలో టీడీపీ మహానాడు జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహానాడును కడపలో జరుపుకోబోతున్నారు. జరగబోయే మహనాడులో కడప బాంబుల్లాంటి విషయాలేం పేలతాయో..? ఎవరి గుండెల్లో మంటలు రేగుతాయో..? ఆ తర్వాత పరిణామాలు ఎలా దారి తీస్తాయోననే అంశంపై టీడీపీ సానుభూతిపరుల్లో ఓ రకమైన ఆందోళనతో కూడిన చర్చ జరుగుతోంది.
ప్రియుడి మోజులో పడి మీరట్ యువతి ముస్కాన్ తన భర్తను హత్య చేసిన కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రిమాండ్ ఖైదీగా ఉన్న ముస్కాన్ గర్బవతి అని నిర్దారణ అయ్యింది.
దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు. మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ హైకోర్టు పేర్కనడాన్ని ఆయన హర్షించారు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాపిరెడ్డి పల్లిలలో మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం (ఏప్రిల్ 8) జరిపిన పర్యటన పెద్ద ప్రహసనంగా మారింది. ఇటీవల హత్యకు గురైన ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జగన్, హెలికాప్టర్ లో వచ్చి, కారులో తిరిగి బెంగళూరు వెళ్లారు.
అలేఖ్య పికిల్స్ వివాదం గత నాలుగోజులుగా నలుగుతూనే ఉంది. అలేఖ్య బూతుపురాణం అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. అదే సమయంలో ముగ్గురు అక్కా చెల్లెల్లు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కాగా ఈ ఇష్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
సికింద్రాబాద్ హౌరా జంక్షన్ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు తృటిలొ పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం సమీపంలో ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు విడిపోయాయి. అది కూడా సరిగ్గా మధ్యలో అంటే రైలు రెండు భాగాలుగా విడిపోయింది.
నాలుగుదశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచీ ఆయనలో మారిన మనిషి ప్రస్షుటంగా కనిపిస్తున్నారు.