పేర్నికి బాలశౌరి ఝలక్? .. నాని మౌనానికి కారణమదేనా?

Publish Date:Jun 19, 2022

Advertisement

మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని..  స్వపక్షంలోనే విపక్షంగా తయారైన   ఎమ్మెల్యే పేర్ని నానికి ఝలక్ ఇచ్చారని  బందరు వైసీపీ శ్రేణుల్లో ఒక చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల బందరులో ఎంపీ బాలశౌరి పర్యటన.. ఈ సందర్భంగా పేర్ని నాని ప్రధాన అనుచరుడి హంగామా ఎపిసోడ్‌ని వైసీపీ హైకమాండ్ చాలా  సీరియస్‌గా తీసుకుందని తెలుస్తోంది. ఆ క్రమంలో ఈ పంచాయతీపై పేర్ని నాని.. పార్టీలో కీలక నేతలకు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా... వారు పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు.మాకంతా తెలుసు మీరు చెప్పాల్సిందీ, చెప్పుకోవలసిందీ ఏమీ లేదంటూ నానిని నోరెత్తనీయలేదని పార్టీ శ్రేణులో అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నాయి.

అయితే బందరులో తన పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అందుకు సంబంధించిన వీడియోను..వైసీపీ పెద్దలకు ఎంపీ బాలశౌరి చూపించినట్లు సమాచారం. అంతేకాకుండా..  మంత్రిగా ఉండగా.. పేర్ని నాని   అవినీతికి   జాబితాను సైతం బాలశౌరి వైసీపీ అగ్రనాయకత్వానికి అందజేసినట్లు చెబుతున్నారు. దీంతో  సీఎం జగన్‌ సహా, పార్టీలోని కీలక నేతలకు ఇంత కాలం  పేర్ని నానిపై ఉన్న సానుకూలత ఆవిరైపోయిందని అంటున్నారు. ఆ కారణంగానే ఎంపీ వల్లభనేని బాలశౌరి వర్గంలో జోష్ పెరిగిందని అంటున్నారు. మచిలీపట్నంలో బాలశౌరి పర్యటన సందర్భంగా సంభవించిన పరిణామాలన్నీ కూడా పేర్ని నాని ఆయన అనుచరవర్గం వల్లేననీ,  జగన్ కు అవగతమయ్యేలా వివరించడంలో ఎంపీ విజయవంతం అయ్యారన్న టాక్ వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది.

జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితోవల్లభనేని బాలశౌరికి ఉన్న అనుబంధం, సీఎం జగన్ తో  ఉన్న వ్యాపార సంబంధం కూడా వైసీపీ హైకమాండ్ కు పేర్ని నాని పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయని కూడా అంటున్నారు.   ఈ నేపథ్యంలో వల్లభనేని బాలశౌరి.. బందరు పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను,ఈ మూడేళ్లలో జరిగిన పలు అంశాలను   సీఎం జగన్‌కు   ఉదాహరణలతో సహా వివరించారని అంటున్నారు.  మంత్రి పదవి పోయిన తరువాత పేర్ని నాని అనుచరగణంలోని పలువురు బాలశౌరి పంచన చేరి, మాజీ మంత్రిగారి లొసుగులను అక్కడ చేరవేయడం వల్లే నాని బలహీన పడ్డారనీ, అధిష్ఠానం వద్ద పలుచన అయ్యారనీ కూడా చెబుతున్నారు.  

ఈ పరిస్థితుల్లో సైలంట్ గా ఉండటమే మంచిదని పేర్ని పట్ల అంతో ఇంతో సానుకూలత ఉన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆయనకు సూచించారని అంటున్నారు. అందుకే పేర్ని నాని, ఆయన అనుచరగణం ప్రస్తుతం మౌనం వహించడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏసీ రూముల్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడం కాదు.. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని లోకేష్ స్పష్టం చేశారు.
తమిళ రాజకీయాల్లో డీఎంకే చిరకాల మిత్రుడు ఎండీఎంకే అధ్యక్షుడు వైకో తాజాగా స్టాలిన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు.
ఎవరికీ ఉపయోగపడకుండా ఖాళీగా పడి ఉన్న ఈ ప్యాలెస్ నిర్వహణ కోసమే నెలకు లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణకు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్ ఫోర్స్ మరోసారి ఉక్కు పాదం మోపింది.
వైసిపి నేత పెర్ని నాని ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనీ.. కానీ తెలంగాణలో ఎవడో ఒంట్లో బాలేదు అంటే వస్తున్నా తమ్ముడూ అంటూ వెళ్ళిపోయారంటూ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఇటీవల ఒక జాతీయ టీవీ చానల్ కు కవిత ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే తిరిగి సొంత గూటికి వెడతారా అన్న ప్రశ్రకు ఆమె భావోద్వేగంగా స్పందించారు.
దెందులూరు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది..
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం
కాక్రోచ్ పార్టీ కేవలం ఒక నిరసన వేదికగా కాకుండా, కాక్రోచ్ జనతా పార్టీగా రూపాంతరం చెందుతూ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది.
మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామానికి చెందిన వైసీపీ నేత కొత్తపల్లి మోహన రావు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.