Publish Date:Jun 19, 2022
మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని.. స్వపక్షంలోనే విపక్షంగా తయారైన ఎమ్మెల్యే పేర్ని నానికి ఝలక్ ఇచ్చారని బందరు వైసీపీ శ్రేణుల్లో ఒక చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల బందరులో ఎంపీ బాలశౌరి పర్యటన.. ఈ సందర్భంగా పేర్ని నాని ప్రధాన అనుచరుడి హంగామా ఎపిసోడ్‌ని వైసీపీ హైకమాండ్ చాలా సీరియస్‌గా తీసుకుందని తెలుస్తోంది. ఆ క్రమంలో ఈ పంచాయతీపై పేర్ని నాని.. పార్టీలో కీలక నేతలకు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా... వారు పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు.మాకంతా తెలుసు మీరు చెప్పాల్సిందీ, చెప్పుకోవలసిందీ ఏమీ లేదంటూ నానిని నోరెత్తనీయలేదని పార్టీ శ్రేణులో అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నాయి.
అయితే బందరులో తన పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అందుకు సంబంధించిన వీడియోను..వైసీపీ పెద్దలకు ఎంపీ బాలశౌరి చూపించినట్లు సమాచారం. అంతేకాకుండా.. మంత్రిగా ఉండగా.. పేర్ని నాని అవినీతికి జాబితాను సైతం బాలశౌరి వైసీపీ అగ్రనాయకత్వానికి అందజేసినట్లు చెబుతున్నారు. దీంతో సీఎం జగన్ సహా, పార్టీలోని కీలక నేతలకు ఇంత కాలం పేర్ని నానిపై ఉన్న సానుకూలత ఆవిరైపోయిందని అంటున్నారు. ఆ కారణంగానే ఎంపీ వల్లభనేని బాలశౌరి వర్గంలో జోష్ పెరిగిందని అంటున్నారు. మచిలీపట్నంలో బాలశౌరి పర్యటన సందర్భంగా సంభవించిన పరిణామాలన్నీ కూడా పేర్ని నాని ఆయన అనుచరవర్గం వల్లేననీ, జగన్ కు అవగతమయ్యేలా వివరించడంలో ఎంపీ విజయవంతం అయ్యారన్న టాక్ వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితోవల్లభనేని బాలశౌరికి ఉన్న అనుబంధం, సీఎం జగన్ తో ఉన్న వ్యాపార సంబంధం కూడా వైసీపీ హైకమాండ్ కు పేర్ని నాని పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని బాలశౌరి.. బందరు పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను,ఈ మూడేళ్లలో జరిగిన పలు అంశాలను సీఎం జగన్‌కు ఉదాహరణలతో సహా వివరించారని అంటున్నారు. మంత్రి పదవి పోయిన తరువాత పేర్ని నాని అనుచరగణంలోని పలువురు బాలశౌరి పంచన చేరి, మాజీ మంత్రిగారి లొసుగులను అక్కడ చేరవేయడం వల్లే నాని బలహీన పడ్డారనీ, అధిష్ఠానం వద్ద పలుచన అయ్యారనీ కూడా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో సైలంట్ గా ఉండటమే మంచిదని పేర్ని పట్ల అంతో ఇంతో సానుకూలత ఉన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆయనకు సూచించారని అంటున్నారు. అందుకే పేర్ని నాని, ఆయన అనుచరగణం ప్రస్తుతం మౌనం వహించడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mp-balasouri-shock-to-perni-nani-25-137995.html
Publish Date:May 10, 2026
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.