హమ్మయ్య వానలొస్తున్నాయ్.!

Publish Date:Jul 15, 2026

Advertisement

నైరుతి రుతుపవనాల మందగమనంతో వర్షాకాలంలో కూడా వేసవిని తలపించే ఎండలు ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.  బంగాళాఖాతంలో ఏర్పడుతున్న  బలమైన అల్పపీడన ద్రోణి  కారణంగా   రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది.  

తాజా అల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో రానున్న వారం రోజులూ తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనావేసింది.

  సాగు పనులు ప్రారంభించి, వర్షాలు లేక ఆందోళన చెందుతున్న తెలుగు రాష్ట్రాల రైతులకు రుతుపవనాల పునరాగమనం పెద్ద ఊరటనిస్తోంది. అదలా ఉంటే..  అల్పపీడన ప్రభావంతో సముద్రం అలజడిగా మారే అవకాశం ఉండటంతో  వచ్చే రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.  

AP Rain Alert, Telangana Weather Forecast, IMD Heavy Rain Warning, Bay of Bengal Low Pressure

By
en-us Political News

  
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.