తెలుగు నేర్చుకోకపోతే జీవితం వృథా!

Publish Date:Aug 29, 2017

Advertisement

 

ఒకప్పుడు సంస్కృతంలో మాట్లాడితే పండితుడు అనుకునేవారు, అందుకని ప్రాంతీయభాషల వారు కూడా బలవంతంగా సంస్కృతంలోనే మాట్లాడేవారు. దేవభాష అయిన సంస్కృతం రానురాను క్షీణించిపోయింది. కానీ ఆ స్థానంలో ఆంగ్లేయుల పెత్తనం మొదలైంది. మొదట తమ వ్యాపార విస్తరణ కోసం స్థానిక భాషలని నేర్చుకునే ప్రయత్నం చేశారు ఆంగ్లేయులు. కానీ ఎప్పుడైతే వారి వ్యాపారం కాస్తా పెత్తనంగా మారిందో... తమ భాషనే స్థానికుల మీద రుద్దడం మొదలుపెట్టారు.

ఇక ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష నేర్చకుంటేనే మనుగడ సాధ్యం అన్న వాదన మొదలైపోయింది. ఆంగ్లం తప్పనిసరే! కాదని ఎవరూ అనడం లేదు. కానీ తొలి ప్రాధాన్యత ఎప్పుడూ మాతృభాషదే కావాలంటున్నారు నిపుణులు. అలా ఎందుకు? అనే ప్రశ్నకు చాలా స్పష్టమైన జవాబులు ఉన్నాయి.

మన జన్యువులలోనే – తరతరాలుగా మనం ఒక భాషకి అలవాటు పడి ఉన్నాము. కాబట్టి మన మెదడు కూడా సదరు భాషకి అనుగుణంగానే ఏర్పడుతుందని చెబుతున్నారు. అంటే మాతృభాష అనేది మన మెదడులోని సహజసిద్ధమైన హార్డ్‌వేర్ అన్నమాట. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం అంటే... మన సహజమైన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడమే!

తల్లి కడుపులోనే – భాష నేర్చుకోవడం తల్లి కడుపులోనే మొదలవుతుందని పరిశోధనలు తేల్చాయి. తల్లి నుంచి వినిపించే శబ్దాలు అతని మెదడులోని భాష నేర్చుకునే భాగాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. తల్లులు లాలిపాటలు పాడటం, కడుపులోని బిడ్డతో మాట్లాడటం వృధా కావనీ... ఆ బిడ్డలోని భాషా నైపుణ్యాన్ని పెంచుతాయని అంటున్నారు. అలా అలవోకగా నేర్చుకుంటున్న భాషని వదిలేసి మరో భాష కోసం ఎగబడం ఎంతవరకు సబబు!

మాతృభాషలోనే నేర్చుకోగలం – ఏడాది దగ్గర నుంచి పిల్లలు, తమ మాతృభాషలో ఒకో పదాన్ని నేర్చుకుంటారు. ఆ భాషలోనే తమకి తెలియని విషయాలను నేర్చుకోవడం, తమ భావాలను వ్యక్తపరచడం చేస్తుంటారు. అది పక్కన పెట్టేసి ఆంగ్లంలో ఒకేసారి ఓనమాలతో పాటుగా పద్యాలని, వాక్యాలని నేర్చుకోవడం ఎంత కష్టం! ఇది వారి జ్ఞానం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒక స్థాయి వరకూ చదువుని మాతృభాషలో నేర్చుకుంటేనే ఉపయోగం అని నివేదికలు తేల్చి చెబుతున్నాయి.

ఏ భాష నేర్చుకోవాలన్నా – పునాది సరిగా లేకుండా ఎన్ని అంతస్తులు కట్టినా ఉపయోగం ఏముంది? మాతృభాష మీద పట్టు సాధించకుండా ఇతర భాషలు నేర్చుకోవడమూ ఇంతే! ముందు మాతృభాష మీద ఒక అవగాహన వచ్చినవాడే ఇతర భాషలను సులువుగా నేర్చుకోగలడనీ, అందులో పరిపూర్ణతను సాధించగలడనీ పరిశోధనలన్నీ ఏకరవు పెడుతున్నాయి.

ఎంత సాధించి ఏం ఉపయోగం – మనిషి ఎప్పుడూ ఒంటరివాడు కాదు. అతనికంటూ ఒక సంస్కృతిక నేపథ్యం ఉంటుంది. కానీ మాతృభాష నుంచి దూరమైనవాడు ఒంటరిగా మారిపోతాడు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్న విషయం అతనికి తోచదు. ఆ ఒంటరితనం తెలియకుండా అతన్ని క్రుంగదీస్తుంది. అందుకే భాషని దూరమైన ఆదిమజాతివారు త్వరగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న పరిశోధన ప్రపంచాన్ని కుదిపేసింది.

జ్ఞానానికి దూరం – భాష అంటే తరతరాల జ్ఞానసంపద. భాషకి దూరమైతే ఆ జ్ఞానానికి కూడా దూరమైపోతాం. ఉదాహరణకు మన చుట్టూ ఉండే మొక్కలనే తీసుకోండి. బీపీని తగ్గించే సర్పగంధి, షుగర్‌ని తగ్గించే నేలవేము గురించి ప్రాంతీయ భాషలలో ఉన్నంత తేలికపాటి సమాచారం ఆంగ్లంలో ఉండదు. అంతదాకా ఎందుకు! వినాయక చవితి రోజున పూజించే ఏకవింశతి పత్రాల గురించి మనం అప్పుడే మర్చిపోయాం. అవన్నీ మన గృహవైద్యంలో భాగమే కదా! ఇలా లాలిపాటల దగ్గర నుంచి సామెతల వరకు మాతృభాషలో అద్భుతమైన విజ్ఞానం దాగి ఉంటుంది. దాన్ని మనం చేజేతులారా దూరం చేసుకుంటున్నాం.

చివరగా ఒక్క మాట. మనకి కోపం వస్తే ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఆంగ్లంలో మాట్లాడటం మొదలుపెడతాం. బాధ కలిగితే అమ్మా అంటూ మనసుకి సర్దిచెప్పుకొంటాం. మన మనసుకి దగ్గరగా ఉన్న మాతృభాష కావాలా, మన అహంకారాన్ని పెంచి పోషించే ఇతర భాషలు కావాలా! తేల్చుకోవాల్సిందే మనమే!

- నిర్జర.

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.