రిజర్వేషన్లు ఉండాల్సిందే.!

Publish Date:Aug 7, 2026

Advertisement

దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థపై  ఉండాల్సిందే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన  యువతతో ముఖాముఖీ నిర్వహించారు. ఆ సందర్భంగా యువత సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.  ఈ సందర్భంగా మోహన్ భగవత్    సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో అసమానతలు, వివక్ష ఉన్నంత కాలం  రిజర్వేషన్లు అమల్లో ఉండాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.   రిజర్వేషన్ల ఫలాలను అందుకుని ఇప్పటికే ఉన్నత స్థాయికి చేరిన వారు తమ వర్గాల్లోని ఇతర వెనుకబడిన వారి ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా కోటాను వదులుకోవాలన్నారు.  

రిజర్వేషన్ల విధానాన్ని  అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్..  విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ..  రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక  అనివార్యత అన్నారు.  చారిత్రక కారణాల వల్ల సమాజంలో ఏర్పడిన హెచ్చుతగ్గులు, వివక్షలను తొలగించడానికే  రిజర్వేషన్ల  వ్యవస్థ రూపుదిద్దుకుందని వివరించిన ఆయన, ఆ అసమానతలు, వివక్షలూ పూర్తిగా తొలగిపోయే వరకూ రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనన్నారు.   

 రాజకీయ స్వప్రయోజనాల కోసం రిజర్వేషన్లను వాడుకోవడం వల్ల సమాజంలో సఖ్యత దెబ్బతిని, వర్గాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయన్న ఆయన  ప్రాథమికంగా సమాజంలో ఐక్యత, సమానత్వం సాధించడానికి రూపుదిద్దుకున్న ఒక గొప్ప వ్యవస్థను, స్వార్థ రాజకీయాల కోసం తప్పుదోవ పట్టించడం శ్రేయస్కరం కాదన్నారు.   దేశంలో రిజర్వేషన్ల పరిమితులు, వర్గీకరణ,  కొత్త కులాల చేరికలపై విస్తృత స్థాయిలో చర్చలు, ఆందోళనలు జరుగుతున్న వేళ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్  చేసిన వ్యాఖ్యలు  ప్రాధాన్యతను  సంతరించుకున్నాయి. 

Mohan Bhagwat, RSS Chief Mohan Bhagwat, Reservations In India, Voluntary Giving Up Reservation, Social Equality India

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.