50 లక్షలమందితో ఒకేసారి.. నిజమేనా ?

Publish Date:Apr 27, 2023

Advertisement

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి  రోహిణి కార్తెను మించి పోతోంది. నిజానికి, మే 10న జరిగేది అసెంబ్లీ ఎన్నికలే అయినా ఈసంవత్సరం చివరి వరకు క్యూలో ఉన్నమరో ఆరేడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, అలాగే, 2024 లోక్ సభ ఎన్నికలకు కర్ణాటక ఫలితం లిట్మస్ టెస్ట్  కావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ, చేజారిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్, అధికారం కోసం హంగ్ కలలు కంటున్న జేడీఎస్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇందులో భాగంగా ప్రతి ఎన్నికను ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకునే మోడీ, షా జోడీ బీజేపీ భవిష్యత్ ను నిర్ణయించే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై సహజంగానే ప్రత్యెక దృష్టిని కేద్రీకరించింది.  2014లో చాయి పే చర్చ  తో మొదలు పెట్టి ప్రతి ఎన్నికల్లో ఒక ప్రత్యేక ప్రచార వ్యూహన్ని అమలు చేస్తున్న మోడీ,షా జోడీ ఈసారి ... అవునా.. నిజామా అనిపించేలా  కొత్త వ్యూహాన్ని అమలు చేసింది.  ప్రధాని నరేంద్రమోదీ ఒకేసారి 50 లక్షల మంది బీజేపీ కార్యకర్తలతో వర్చువల్‌గా మాట్లాడారు. నిజానికి కర్ణాటకలో బీజేపీ ఎదురీతుతోంది, అవినీతి ఆరోపణల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ 40 శాతం కమిషన్ స్లోగన్ ప్రజలను ఆలోచింప చేస్తోంది. మరో వంక కాంగ్రెస్ ప్రభుత్వాలపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆసరా చేసుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ కర్ణాటకలో మాత్రం అవినీతి ప్రస్తావన లేకుండా, రాకుండా జాగ్రత్త పడుతోంది.  

చివరకు ప్రధాని మోడీ, కార్యకర్తల మెగా మీట్ లోనూ అవినీతి అంశాన్ని ముట్టుకోలేదు. కానీ  బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్‌కు వారంటీ ముగిసిందని వ్యాఖ్యానించారు. వారంటీ ముగిసిన కాంగ్రెస్ మీకేం గ్యారెంటీ ఇస్తుందని వ్యంగ బాణాలు సందించారు.  అంతేకాదు, ఈ రోజు వర్చువల్’గా ఒకే సారి 50 లక్షల మంది కార్యకర్తలతో మాట్లాదిన మోడీ మరో రెండు రోజుల్లో మీ మధ్యకు వస్తాను. కన్నడ ప్రజల ఆశీస్సులు తీసుకుంటాను, అంటూ తనదైన స్టైల్లో ఇటు కార్యకర్తలను అటు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే  డబుల్ ఇంజిన్ సర్కార గురించీ మోడీ ప్రస్తావించారు. అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే వస్తే సరిపోదు. అది పూర్తి మెజార్టీతో ఉండాలి. దేశంలో మొదటి ఎయిమ్స్ 1956లో ప్రారంభమైంది. కానీ  ఆ తర్వాతది ఎప్పుడు వచ్చింది..?  దాని గురించి కాంగ్రెస్ ఏమీ మాట్లాడదు.

మేం అధికారంలోకి వచ్చాం. ఎయిమ్స్‌ సంఖ్యను మూడు రెట్లు పెంచాం. ఇప్పుడు చెప్పండి డబుల్ ఇంజిన్‌ వల్ల లాభమా..? నష్టమా..? కాంగ్రెస్ అంటేనే ఒక అబద్ధపు గ్యారంటీ. కాంగ్రెస్ ఉంటే అవినీతికి గ్యారంటీ. ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీ వారంటీ ముగిసింది అంటూ మోదీ విమర్శలు గుప్పించారు.  5 నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి 50 లక్షల మంది కార్యకర్తలతో మాట్లాడడం ఎంతవరకు నిజమన్న దానిపై   కర్ణాటకలో విస్తృత చర్చ జరుగుతోంది.

ఇక ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువ ఉండటంతో బీజేపీ నాయకులు వీలైనంత త్వరంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి, మరోసారి అధికారంలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్రం కావడంతో పాటుగా, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కు సవాలుగా నిలిచిన ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ప్రధాని మోడీచరిష్మా, హోం మంత్రి అమిత్  షా వ్యూహరచన , సంఘ్ పరివార్ అడదందలపైనా ఆధార పడితే,  కాంగ్రెస్ పార్టీ స్థానికంగానే బీజేపీ  ఎదుర్కునేందుకు సిద్దమవుతోంది. అయినా రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా సహా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్ణాటక పైన ప్రత్యేక దృష్టి  సారించారు.

మరో వంక కర్ణాటకలో ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చెయ్యాలని బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కన్నడిగులు ఎవరిని ఆదరిస్తారు ? అనే విషయం తేలాలంటే వచ్చే నెల 13 వరకూ ఆగాల్సిందే.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.