మోదీ నాయకత్వం.. తక్షణ ప్రయోజనాల కోసం కాదు.. భవిష్యత్ కోసం!

Publish Date:Apr 20, 2026

Advertisement

సాధారణంగా భారత రాజకీయాలలో నేతలు తక్షణ ఫలితాలే పరమావధిగా పని చేస్తుంటారు. ఈ రోజు వార్తల్లో ఎలా కనిపించాలి. ఎన్నికలలో ఎలా లాభపడాలి, ప్రత్యర్థిపై పై చేయి ఎలా సాధించాలి అన్న దానిపైనే ఆలోచిస్తుంటారు. ఆ తక్షణ ప్రయోజనాల చుట్టూనే తిరుగుతుంటారు.  అయితే ప్రధాని మోడీ అలా కాదంటారు విశ్లేషకులు. మోడీ రాజకీయాలు ఐదు రోజుల కోసమే, తక్షణ ప్రయోజనాల కోసమో కాదు.. రాబోయే ఐదు దశాబ్దాల కోసమని అంటారు. అంటే దేశ భవిష్యత్, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, జియోపాలిటికల్ ప్లేస్, గ్లోబల్ ఎఫెక్ట్..వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మోడీ అడుగులు వేస్తున్నారని పరిశీలకుల విశ్లేషణ.  

ముందుండి నడిపిస్తున్నా..  వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు.  మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు.  
ఆయన రాజకీయ శైలిలో  ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.  ప్రాక్టివ్ లీడర్షిప్.. దేశానికి అవసరమైన సంస్కరణలను ముందే ప్రారంభించడం. రియాక్టవ్   అవగాహన.. ప్రత్యర్థులు ఏ దిశగా కదులుతున్నారో అర్ధం చేసుకుని.. అదే దిశలో ముందుగానే కౌంటర్ స్ట్రాటజీ అంటే ప్రతి వ్యూహం సిద్ధం చేయడం. 

 ప్రపంచ సంక్షోభాల్లో మోదీ నాయకత్వం 

గత దశాబ్దంలో భారత్ ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లు ఏమిటంటే.. కరోనా మహమ్మారి, ప్రపంచ ఆర్థిక మాంద్యం, చైనా, అమెరికా ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో అస్ధిరత.  వీటి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. అయితే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిలబడటంలో మోడీ నాయకత్వమే కీలకమని పరిశలకులు విశ్లేషిస్తున్నారు.   
భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్నది. విదేశీ పెట్టుబడుల్లో గణనీయ పురోగతి, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, మౌలిక సదుపాయాల విస్తరణ. బలోపేతమౌతున్న మాన్యు ఫ్యాక్చరింగ్ రంగం. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక దృష్టితో మోడీ తీసుకున్ననిర్ణయాల ఫలితమేనని పరిశీలకులు చెబుతున్నారు.

ఇక మోడీ వ్యతిరేకులు తరచూ..    ఆర్థిక వ్యవస్థపై, విదేశాంగ విధానంపై, అంతర్గత రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తుంటారు. అదే సమయంలో మోడీ అనుకూలురు మాత్రం విమర్శకులు తాత్కాలిక సమస్యలపై దృష్టి పెడతారనీ,  మోదీ మాత్రం దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెడతారనీ సమర్ధిస్తారు. 
అంటే.. విమర్శలు తక్షణ ప్రతిస్పందన, మోడీ నిర్ణయాలు, విధానాలూ భవిష్యత్ నిర్మాణం కోసం అంటుంటారు.  విశ్లేషకుల అంచనాల ప్రకారం మోడీ మరో నాలుగైదేళ్ల పాలన భారత్ ను సురక్షితమైన, ఆర్థికంగా బలమైన, జియోపాలిటికల్గా ప్రభావవంతమైన, ప్రపంచంలో తిరుగులేని స్థానంలో నిలబెట్టే అవకాశం ఉంది. అంటే.. మోదీ నాయకత్వంలో భారత్  విశ్వగురు దిశగా పయనిస్తోంది. మోదీ నాయకత్వం  తక్షణ రాజకీయాలకంటే పెద్ద కథ. మోదీ నాయకత్వాన్ని అనుకూలంగా చూసే వర్గం ఆయనను దూరదృష్టి ఉన్న నాయకుడిగా చూస్తుంటే.. అయన విమర్శకులు మాత్రం తక్షణ రాజకీ యాల నాయకుడిగా చూస్తారు. కానీ మోడీ మద్దతుదారుల దృష్టిలో  ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం భారత భవిష్యత్తు కోసం వేసిన పునాది.అందుకే  వారు మోడీని అంచనా వేయడం సులభం కాదు.. ఆయన రాజకీయాలు ఈ రోజు కోసం కాదు.. రాబోయే దశాబ్దాల కోసమని చెబుతారు. 

సంకలనం, సేకరణ : సీతారాం కంఠమనేని

By
en-us Political News

  
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.