Publish Date:May 11, 2026
దేవాన్ష్ తో మోడీ ఫోటో ప్రెజంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం దేవాన్ష్ అన్న భావనే. అరే బుడ్డోడా.. ఇప్పటికే మీ తాతను చూశాన్నేను.. మీ నాన్నతో కూడా పరిచయమే. ఇక పోతే నువ్వు, రేపటి రోజున నేను లేని రోజులు పార్టీలో ఎదురు కావచ్చు. నువ్వు మాత్రం బీజేపీతో ఇలాగే కలసి నడువు. మా వాళ్లతో మంచిగా ఉండు.. అంటూ మోడీ దేవాన్ష్ తో ముచ్చట్లు పెట్టినట్లు నెట్టింట్ బోలెడు పోస్టులు దర్శనమిస్తున్నాయి.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోలకే లెక్కలేనన్ని కామెంట్లు వస్తుంటాయి. అలాంటిది లోకేష్ తనయుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
బేసిగ్గా మోడీ ప్రస్తుత ప్రభుత్వం తెలుగుదేశం 16 సీట్ల సాయంతో నడుస్తున్న సంగతి తెలిసిందే . అందుకే ప్రధాని మోడీ ఇప్పటికే ఏపీకి ఎన్నో వరాలు కురిపించేశారు. తాజాగా గత ప్రొటోకాల్ ను పక్కన పెట్టి మరీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల నివాసాలకువెళ్లి మరీ వారి కోసం విలువైన సమయాన్ని వెచ్చించారు. కాగా చంద్రబాబు నివాసానికి వెళ్లిన సమయంలో మోడీ చంద్రబాబు మనవడు, లోకేష్ కుమారుడైన దేవాన్ష్ భుజంపై చేయి వేసి మరీ ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇదంతా కూడా ఒక ఎమోషన్ బిల్డప్ లో భాగంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మోడీ ఒక ప్రధాన మంత్రి మాత్రమే కాదు.. బీజేపీ ప్రస్తుత అగ్రనాయకుల్లోనే అగ్రగామి. అలాంటి నేషనల్ టవరింగ్ పర్సనాల్టీ.. ఒక బాలుడిని ఇంతగా దగ్గరకు చేర్చుకోవడం వెనక చాలానే అర్ధతాత్పర్యాలున్నాయంటున్నారు.
ఇటు తెలంగాణకు సంబంధించి.. రేవంత్ ని మా పార్టీలోకి వచ్చేయవచ్చు కదా? అని చమత్కరిస్తూనే.. అటు ఏపీ పాలిటిక్స్ లో భాగంగా.. దేవాన్ష్ తో ఫోటోలకు పోజులు ఇవ్వడం వెనుక ఎంతో గూడార్థముందంటున్నారు. దక్షిణాదిలో నానాటికీ పడిపోతున్న బీజేపీ గ్రాఫ్ ఇప్పుడు ఆ పార్టీ కేంద్ర నాయకత్వంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోడీ ఇప్పటి వరకూ ప్రధానమంత్రి పదవిలోకి వచ్చి.. మొత్తం తొమ్మిది కొత్త రాష్ట్రంల్లో అధికారంలోకి తేగలిగారు కానీ.. దక్షిణాదిలో మాత్రం బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగటి అన్న చంద్రంగానే ఉంది. పాండిచ్చేరి తప్ప.. ఇక్కడ ఏ రాష్ట్రంలోనూ బీజేపీ పెద్ద బలంగా లేదు. ఏపీలో కేవలం కూటమితో కలసి అధికారంలో భాగం పంచుకుంటోందంతే. ఈ రాష్ట్రంలో బీజేపీది చాలా చాలా చిన్న పాత్ర అయినా సరే అది తమకెంతో విలువైనది అని చాటడానికే ప్రధాని మోడీ దేవాన్ష్ తో చనువుగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-chats-with-devansh-39-219449.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.