వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా : మంత్రి సవిత
Publish Date:Jun 14, 2025
Advertisement
వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వైసీపీ సవాల్ విసిరారు. మంళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. వైసీపీ ఆరోపిస్తున్నట్లు ‘తల్లికి వందనం’ నిధులు మంత్రి లోకేష్ జేబులోకి వెళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా, నిరూపించలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగలరా? అని జగన్‌కు సవాల్ విసిరారు.విద్య విలువ తెలిసిన నాయకుడు నారా లోకేష్ అయితే.. విద్యకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం అన్నారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. రూ.67లక్షల 27వేల 164 మందికి తల్లికి వందనం అందజేశామని పేర్కొన్నారు. దాదాపు రూ. 8,745 కోట్లు తల్లికి వందనం కింద డైరెక్టుగా తల్లుల అకౌంట్లలోకి నిధులు జమ అయ్యాయి. తల్లిదండ్రులు, పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ తల్లికి వందనం ఇవ్వడం గొప్ప విషయం. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ బాబు ల కృషి ఎనలేనిదని మంత్రి సవిత పేర్కొన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తుండగా, అందులో రూ.2 వేలు పాఠశాల అభివృద్ధికి, మిగిలిన రూ.13 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. "ఇంట్లో ఒకరుంటే రూ.13 వేలు, ఇద్దరుంటే రూ.26 వేలు, ముగ్గురుంటే రూ.39 వేలు, నలుగురుంటే రూ.52 వేలు, ఐదుగురుంటే రూ.65 వేలు అందజేశాం. ఒక కుటుంబంలోని ముగ్గురు ఆడబిడ్డలకు ఈ పథకం అందడంతో వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు" అని మంత్రి పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/minister-savita-39-199936.html





