Publish Date:Jun 17, 2026
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 11 వందల 67 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు పునాది రాయి పడింది.
ఈ పనులకు మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ బుధవారం (జూన్ 17) శంకుస్థాపన చేశారు. తాడేపల్లి ప్రాతూరు రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో రెండు దశలుగా చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం 11 వందల 67.50 కోట్ల రూపాయలు కాగా, మొదటి దశ పనులకు.604.32 కోట్లు, రెండూ దశ పనులకు 563.18 కోట్ల రూపాయలు కేటాయించారు.
మంగళగిరి నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా జనం మురుగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల ప్రాచారంలో మంగళగిరిలో మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పనులను ప్రారంభించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-lokesh-lays-foundation-stone-for-underground-drainage-works-36-223242.html
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!