గాలి మళ్లీ జైలుకు?

Publish Date:Sep 15, 2022

Advertisement

బళ్లారి గనులను అక్రమంగా కొల్లగొట్టిన మైనింగ్ టైకూన్ గాలి జనార్ధన్ రెడ్డి త్వరలో మళ్లీ జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. గాలి మైనింగ్ అక్రమాల కేసు విచారణ ఇక వేగవంతం కాక తప్పని అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. గాలి జనార్ధన్ రెడ్డి కేసు విచారణలో ఆమోదయోగ్యం కాని జాప్యంపై  సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు  తాజా పరిస్థితిపై ఈ నెల 19లోగా సీల్డ్ కవర్ లో నివేదిక పంపాలని హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టును సుప్రీం  ఆదేశించింది. దీంతో కొంత కాలంగా షరతులతో కూడిన  బెయిల్ పై    స్వేచ్ఛగా ఉన్న గాలి మళ్లీ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని న్యాయ నిపుణులు అంటున్నారు. 

గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై  సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ 12 ఏళ్లుగా ఆలస్యం కావడం సహించరానిదని సుప్రీం కోర్టు   వ్యాఖ్యానించింది. తాము గతంలో విచారణను వేగవంతం చేయాలని ఆదేశించినా  జాప్యం ఎందుకు జరిగింది? విచారణ ఏ దశలో ఉంది? ఏ కారణాల చేత విచారణ ముందుకు సాగడంలేదో సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ లోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి సుప్రీం ద్విసభ్య ధర్మాసనం వాయిదా వేసింది.

ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డితో పాటు మరో 9 మందిపై సీబీఐ 2009లో కేసులు నమోదు చేసింది. 2011సెప్టెంబర్ 5న జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్ లోని కడప, అనంతపురం జిల్లాలకు వెళ్లకూడదనే షరతులతో సుప్రీంకోర్టు 2015 జనవరి 20న జనార్ధన్ రెడ్డికి బెయిలు మంజూరు చేసింది.  కోర్టు ఆదేశాలను పాటిస్తున్నందున బెయిలు షరతులను సడలించాలంటూ జనార్ధన్ రెడ్డి 2020లో మరోసారి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందుగా ఆయా జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లకు తెలియజేసి బళ్లారి, కడప, అనంతపురం వెళ్లవచ్చని గత ఏడాది ఆగస్టు 19న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.

ఈ నేపథ్యంలో జనార్ధన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంలో సీబీఐ అఫిడవిట్ వేసింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ ను జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం(సెప్టెంబర్14) విచారించింది. గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారిలో ఉంటే సాక్షులకు ముప్పు అంటూ సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ వాదనలు వినిపించారు.  గాలి జనార్ధన్ రెడ్డి స్వస్థలం బళ్లారి. ఆయన అక్కడ ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు. సాక్షుల ప్రాణాలకు కూడా ముప్పు ఉందని ధర్మాసనానికి విన్నవించారు.

మాధవి దివాన్ వాదనపై స్పందించిన జస్టిస్ ఎం.ఆర్.షా సీబీఐ కేసు విచారణ ఏ దశలో ఉందని ప్రశ్నించారు. విచారణ సాగడం లేదని మాధవి దివాన్ బదులిచ్చారు. విచారణపై స్టే ఉందా.. అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గతంలో అయితే లేదని ఏఎస్ జీ సమాధానం ఇచ్చారు. గతం విషయం తాను అడగటం లేదని, ప్రస్తుతం స్టే ఉందా? అని జస్టిస్ షా ప్రశ్నించారు. దీనికి ఏఎస్ జీ వద్ద సరైన సమాధానం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తీవ్రమైన అభియోగాలున్న ఈ కేసు నమోదైన 12 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ సీబీఐ కేసులు న్యాయస్థానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట సాగకపోవడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని సుప్రీం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ఆదేశాలతో   గాలి జనార్ధన్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు.

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.