మెదడుతోనే వీడియోగేమ్
Publish Date:Dec 8, 2016
Advertisement
ఇదీ విధానం కళ్ల ముందు కదిలిపోయే సన్నివేశాలలో మనం కూడా భాగంగా కనిపించే వర్చువల్ ఆటలకి (Virtual games) ఇదీ ఆట ఆటలో భాగంగా తెరమీద 21 చతురస్రాలు కనిపిస్తాయి. వాటిని పైకి కానీ కిందకి కానీ జరుపుతూ ఆటని కొనసాగించాలి. అది ఎటువెళ్లాలో ఆటగాడు నిర్ణయించుకున్నప్పుడు అతని మెదడులోని ‘ప్రాస్పేన్’ అనే భాగంలో స్పందనలు కలుగుతాయట. ఈ ‘ప్రాస్పేన్’ను కాంతిసంకేతాలుగా మార్చి వాటి ద్వారా వీడియోగేమ్ ఆడించే ప్రయత్నం చేశారు. శరీరం నుంచి నామమాత్రమైనా సహకారం లేకుండా, కనీసం కంటిచూపుని కూడా అనుసరించకుండా చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు విజయవంతం అవుతుందో అని పరిశోధకులు కూడా అనుమానపడ్డారు. కానీ 92 శాతం సందర్భాలలో ఆటగాళ్ల మెదడు ఏ తీరులో అయితే స్పందించిందో, దానికి అనుగుణంగా ఆట కదలడం చూసి సంబరపడిపోయారు. ఆట కోసం మాత్రమే కాదు వీడియోగేమ్ విజయవంతం అయ్యింది కదా అని ఈ పరిశోధన కేవలం ఆటలకే పరిమితం అనుకోవడానికి లేదు. మెదడులో ఆజ్ఞని అందించడం అనేది మన నిజజీవితంలో ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపుతుందంటున్నారు పరిశోధకులు. కారు తోలడం దగ్గర్నుంచీ కృత్రిమ అవయవాలని నియంత్రించడం వరకూ మెదడుతోనే పనికానిచ్చేయవచ్చు అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ కొత్త ఆవిష్కరణ మనకి ఆరో ఇంద్రియాన్ని ప్రసాదిస్తోందంటున్నారు. ఇప్పటివరకూ మెదడు మీద జరిగిన ప్రయోగాలన్నీ అందులో ఉన్న సమాచారాన్ని ఎలా క్రోడీకరించాలి? అన్న దిశగానే సాగాయి. కానీ ఈ కొత్త ప్రయోగం ద్వారా మెదడుకి సమాచారాన్ని నేరుగా ఎలా అందించాలి? సమాచారాన్ని అందుకున్న తరువాత మెదడులో జరిగే ప్రతిస్పందనలకు ఎలా రూపం కల్పించాలి? అన్న తరహా పరిశోధనలకు దారితీసినట్లయ్యింది. మరి ఈ తొలి అడుగు మరెన్ని విజయాలకు దారితీస్తుందో! - నిర్జర.
సాంకేతికత రోజురోజుకీ తెగ అభివృద్ధి చెందుతోంది. దాంతో ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాలలోనే సాధ్యమనుకునే విషయాలు కళ్ల ముందే సాకారం అవుతున్నాయి. వాటిలో ఒకటి- కేవలం ఆలోచనలతోనే వీడియోగేమ్‌ను అడగలిగే శక్తి! వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఆ శక్తిని సాకారం చేసే దిశగా కొన్ని విజయాలు సాధించారు.
కొదవలేదు. కానీ ఓ మనిషి మెదడులో మెదిలే ఆలోచనల సాయంతో అతని ఆటతీరు సాగే అవకాశం ఉందేమో అని శోధించే ప్రయత్నం చేశారు. అంటే ఇందులో ఆటగాడిలో ఎలాంటి శరీర కదలికా ఉండదన్నమాట. అతని తలకి కొన్ని పరికరాలు చుట్టి ఉంటాయన్నమాట.
http://www.teluguone.com/news/content/mind-vedio-game-35-70048.html





