Publish Date:Jan 31, 2025
కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ వరుసగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ప్రవేశపెట్టనున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అన్ని వర్గాలలో ఈ బడ్జెట్ పై విపరీతమైన ఆశలు ఉన్నాయి. అన్ని వర్గాల ఆకాంక్షలనూ నెరవేర్చేలా బడ్జెట్ ఉండబోతోందన్న అంచనాలూ ఉన్నాయి.
లోక్ సభలో బీజేపీకి స్వయంగా పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో ప్రభుత్వ మనుగడ ప్రధానంగా తెలుగుదేశం, జేడీయూ వంటి పార్టీల మద్దతుపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, బీహార్ లకు కేటాయింపుల్లో సింహభాగం దక్కే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో గతంలోలా మోడీ సర్కార్ పై ప్రజలలో సంపూర్ణ విశ్వాసం కొరవడటానికి కారణాలను అన్వేషించిన బీజేపీ అగ్రనాయకత్వం ఈ సారి బడుగు, బలహీన, మధ్య తరగతిపై వరాల జల్లు కురిపించేలా బడ్జెట్ ఉంటుందన్న అంచానాలూ ఉన్నాయి.
శనివారం (ఫిబ్రవరి 1) ఉదయం 11గంటలకు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాలూ అంటే బడుగు,బలహీన మధ్యతరగతి, పారిశ్రామికవర్గాల నుంచి వేతన జీవుల వరకూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో తమకు ప్రయోజనం కలిగించే ప్రకటనలు ఉంటాయని ఆశిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్మలమ్మ పద్దులో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు పలు అంశాల్లో ఊరట లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వ్యవసాయదారులు, మహిళలు, పేదవర్గాలు, యువతపై ప్రత్యేక దృష్టి పెట్టి మరీ బడ్జెట్ ను రూపొందించిననట్లు తెలుస్తోంది. ఆర్థిక వృద్ధిరేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పతనమైన పరిస్థితుల్లో దానిని పెంచడం, అలాగే అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్.. ఇతర దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తి కనిపిస్తోంది.
ఇక బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు అలాగే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసగం బట్టి చూస్తే ఈ సారి బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఆదాయపన్ను విధానంలో భారీ సంస్కరణలకు ఈ బడ్జెట్ తెరతీస్తుందని అంటున్నారు. అలాగే పన్ను శ్లాబుల విషయంలో కూడా వేతన జీవులకు మంచి వెసులుబాటు ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక విత్తమంత్రి నిర్మలాసీతారామన్ పద్దుపై తెలుగు రాష్ట్రాలూ ఆసక్తిగా ఆశగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలవరం, అమరావతిలకు మరిన్ని నిధులను కేంద్రం కేటాయిస్తోందని ఆశిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/middle-class-hopes-on-union-budget-25-192158.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.