మన్మోహన్ ఆధునిక భారత వైతాళికుడు!

Publish Date:Dec 26, 2024

Advertisement

మాజీ ప్రధాని మన్మోహన సింగ్ తీవ్ర అస్వస్థతతో గురువారం (డిసెంబర్ 26)   ఢిల్లీ ఎయిమ్స్‌లో  చికిత్స పొందుతూ  తుదిశ్వాస విడిచారు.  92 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌.. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వశాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిటీ చైర్మన్‌ గా   ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు.

దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు.  అంతకు ముందు పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ను   దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా చెబుతారు.  తొలి ప్రధాని నెహ్రూ తర్వాత, ప్రధానిగా ఒక టర్మ్ పూర్తి చేసుకుని, రెండోసారి మళ్లీ ఎన్నికైన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుంది.  ఆ తర్వాత నరేంద్ర మోదీ వరసగా మూడుసార్లు ప్రధాని అయ్యారు. 

నేడు మోదీ నాయకత్వంలో బలంగా ఉన్న భారత విదేశాంగ విధానం వెనుక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వేసిన పటిష్టమైన పునాదులే కారణమనడంలో సందేహం లేదు. ముఖ్యంగా 90 వ దశకంలో భారత్ తీసుకున్న రెండు ప్రధాన నిర్ణయాలు భారత్ దౌత్య విధానం, దృక్పథంలో మార్పులు తీసుకొచ్చాయి. అవే పీవీ నరసింహరావుతో కలిసి 1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలో 1998 నాటి పోఖ్రాన్‌ అణు పరీక్షలు.  ఈ రెండు నిర్ణయాలు మాత్రం ఆధునిక భారత గమనానికి బాటలు వేశాయి.

మన్మోహన్ ఆర్దికవేత్త అయినప్పటికీ విదేశీ వ్యవహారాలపై కూడా  పట్టు ఉంది. 2004లో అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత  మన్మోహన్ సింగ్ దేశ విదేశాంగ విధానంపై   దృష్టి సారించారు. భారత విదేశాంగ విధానంలో పోఖ్రాన్ అణు పరీక్షలు కీలకమైనవని విశ్వసించిన మన్మోహన్ సింగ్  వాజ్‌పేయి ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో వచ్చిందే అమెరికాతో పౌర అణు ఒప్పందం. మన్మోహన్‌ సింగ్‌ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది ముఖ్యమైనదనడంలో సందేహం లేదు మన్మోహన్ సింగ్  దూరదృష్టికి, నాయకత్వ పటిమకు ఈ ఒప్పందం అద్దంపట్టిందని చెప్పవచ్చు. 

వాగ్ధాటి ఉన్నవారే రాజకీయాలలో రాణిస్తారన్న ప్రచారానికి మన్మోహన్ సింగ్ తెరదించారని చెప్పాలి. ఆయన మాటల మనిషి కాదు.. చేతల మనిషి అని తన పని ద్వారా రుజువు చేసుకున్నారు. దేశ ప్రధానిగా దశాబ్దం పాటు ఆయన సేవలందించారు. ఆ దశాబ్ద కాలంలో దేశంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. అయితే ఆయన దేశానికి సేవలందించడం అన్నది ప్రధానిగానే ఆరంభం కాలేదు.  ప్రధానిగా పీవీ నరసింహరావు బాధ్యతలు చేపట్టేనానికి దేశం దివాలా స్థితిలో ఉంది. భారత్ వద్ద విదేశీ మారకద్రవ్యం చాలా తక్కువగా ఉంది.దిగుమతులకు ఇబ్బందిపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సరిగ్గా ఆ సమయంలో మన్మోహన్ సింగ్  తన ఆర్థిక నైపుణ్యంతో  దేశాన్ని గట్టెక్కించారు.   బంగారాన్ని ప్రత్యేకంగా విమానంలో లండన్ తరలించి తాకట్టు పెట్టి  దేశాన్ని దివాళా స్థితి నుంచి బయటపడేశారు.  ఆయన దూరదృష్టి ఆర్థిక నైపుణ్యం కారణంగానే ఇప్పుడు భారత్  ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నది. 

ప్రత్యక్ష ఎన్నికలలో మన్మోహన్ సింగ్ ఎన్నడూ పోటీ చేసి ఉండకపోవచ్చు.   కానీ ఆయన మాత్రమే దేశాన్ని గాడిలో పెట్టగలరని భావించిన పీవీ నరసింహరావు ఆయనను అర్థిక మంత్రి తన కేబినెట్ లో నియమించారు.  ఆ బాధ్యతను ఆయన అనితర సాధ్యమన్న రీతిలో నిర్వహించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు.  తర్వాత కాంగ్రెస్ విజయం సాధించినప్పుడు సోనియా ప్రధాని పదవి చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రధానిగా ఆమె మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేసుకోవడం ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. సమర్థత ఆధారంగానే ఆయనకు ఆ పదవి దక్కింది.    92 ఏళ్ల వయసులో కన్నుమూసిన మన్మోహన్ సింగ్ ముద్ర దేశ ఆర్థిక ప్రయాణంలో  అడుగు అడుగులోనూ కనిపిస్తుందనడంలో సందేహం లేదు. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.