శిశిర్‌, దివ్యేందుల‌పై దీదీ ఆగ్ర‌హం

Publish Date:Aug 8, 2022

Advertisement

తండ్రి మాట త‌న‌యుడు వింటాడు. తండ్రి బాట‌లోనే త‌న‌యుడు వెళ్లాల‌నుకోవ‌డంలోనూ త‌ప్పు లేదు. తండ్రి ఒక‌రికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌నుకున్న‌పుడు త‌న‌యుడు ప‌క్క‌నే ఉండి త‌నూ ఓకే అన‌కుండా ఎలా ఉం టాడు. అందులోనూ ఇద్ద‌రూ ఎంపీల‌యిన‌పుడు. ఈ తండ్రీ కొడుకుల స్వీయ నిర్ణ‌యం వారిద్ద‌రికి బావుం దేమోగాని వారిని ఎంపీలుగా చేసిన టీఎంసీ పార్టీ అధినేత‌కుమాత్రం స‌సెమిరా న‌చ్చ‌లేదంటే న‌చ్చ‌ లేదు. పార్టీలో ఉన్న‌పుడు పార్టీ నియ‌మాల‌కు క‌ట్టుబ‌డి ఉండాలి. పార్టీ అధినేత చెప్పిన మాటే శాస‌నం అవుతుంది. అదే వినాలి, అదే చేయాలి. లోక్‌సభలో తృణమూల్ పక్షనేత  శిశిర్ అధికారి, ఆయ‌న కుమారుడు దివ్యేందు అధికారి  కూడ‌బ‌లుక్కున్న‌ట్టుగా ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొన్నారు. వాస్త‌వానికి వారికి వారి అధినేత మ‌మ‌తా బెన‌ర్జీ ఆదేశాలేమీ లేవు. కానీ వారు ధైర్యం చేశారు. ప‌శ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత మ‌మ‌తా బెన‌ర్జీకి కోపంవ‌చ్చింది. పార్టీ అధినేత‌తో సంప్ర‌దించ‌కుం డానే ఓటింగ్‌లో పాల్గొన్నార‌ని తెలిసింది. 

ఉపరాష్ట్రపతి ఎన్నికలతో తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేగింది. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినా ఇద్దరు ఎంపీలు ఓటు వేయడంపై ఆ పార్టీ అధిష్టానం కన్నెర్ర చేసింది. పార్టీ ఎంపీలిద్ద‌రికీ   ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడంపై షోకాజ్ నోటీసులు జారీచేసింది. వివరణ ఇవ్వాలంటూ లోక్‌సభ లో తృణమూల్ పక్ష నేత సుదీప్ బంధో పాధ్యాయ  ఆ ఇద్దరు ఎంపీలకు లేఖలు రాశారు. పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగ్‌దీప్ ధనకర్‌ ను ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్డీయే ప్రకటించడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని తృణమూల్ ముందే నిర్ణయించింది. తద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తృణమూల్‌కు పార్లమెంట్‌లో మొత్తం 35 మంది ఎంపీలున్నా రు. ఇందులో 23 మంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

సుదీప్ బంధోపాధ్యాయ రాసిన లేఖలు అందుకున్న శిశిర్ అధికారి పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత సువేందు అధికారి తండ్రి. శిశిర్ అధికారి పశ్చిమబెంగాల్ కాంతి నియోజకవర్గం నుంచి మూడు సార్లు టీఎంసీ ఎంపీగా గెలుపొందారు. ఆయన మరో కుమారుడు దిబ్యేందు అధికారి 2019లో తమ్లుక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. పశ్చిమబెంగాల్‌లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సువేందు అధికారి బీజేపీ లో చేరినా వీరు తృణమూల్‌‌కు రాజీనామా చేయలేదు. టీఎంసీ లోనే కొనసాగుతున్నారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో శిశిర్  దిబ్యేందు లు  ఓటుహక్కు విని యోగిం చుకోవడం పార్టీ ఆదేశాలను ధిక్కరించడమేనని తృణమూల్ అధిష్టానం కన్నెర్ర చేసింది. 

కాగా వీరిపై లోక్‌సభ స్పీకర్‌కు ఇప్పటికే అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఆధారాలు కావాలంటూ దాట వేశారని సుదీప్ బంధోపాధ్యాయ ఆరోపించారు. లోక్‌సభ స్పీకర్ వీరిపై చర్యలు తీసుకోకున్నా పార్టీ తరపున కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి.  ఈ నెల ఆరున జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి జగదీప్‌ ధనకర్ 528 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి, యూపిఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. ధనకర్‌కు 346 ఓట్ల ఆధిక్యం లభించింది

By
en-us Political News

  
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.