Publish Date:May 11, 2026
తృణమూల్ కాంగ్రెస్ కు సువేందు అధికారి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమత బెనర్జీ మేనల్లుడికి భద్రత ఉపసంహరించుకుంది. తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఇప్పటివరకు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పశ్చిమ బెంగాల్ లో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలై.. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. సువేందు అధికారి సీఎంగా పగ్గాలు చేపట్టగానే మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు, టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీకి జడ్ ప్లస్ కేటగరీ భద్రతను ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
ముఖ్యమంత్రి సువేందు అధికారి సచివాలయం నబన్న లో జిల్లా మెజిస్ట్రేట్లు మరియు సీనియర్ పోలీసు అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. భద్రత అనేది కేవలం ప్రాణహాని ఉన్నవారికి మాత్రమే ఉండాలని.. అది స్టేటస్ సింబల్ గా మార్చకూడదని ముఖ్యమంత్రి సువేందు అధికారి పేర్కొన్నారు. ప్రజా ధనాన్ని అనవసర భద్రతా ఏర్పాట్ల కోసం ఖర్చు చేయడం సరికాదన్నారు.
కోల్‌కతాలోని అభిషేక్ బెనర్జీ నివాసం ద్ద ఉన్న భారీ పోలీస్ బారికేడ్లను, కియోస్క్‌లను పోలీసులు తొలగించారు. అలాగే కామాక్ స్ట్రీట్‌లోని ఆయన కార్యాలయం వద్ద ఉన్న నిఘా పరికరాలను, అదనపు బలగాలను కూడా వెనక్కి పిలిపించారు.
గతంలో 2015లో ఒక బహిరంగ సభలో అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి తర్వాత ఆయనకు భద్రతను జెడ్ ప్లస్ కేటగిరీకి పెంచారు. సుమారు 55 మంది భద్రతా సిబ్బంది, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఆయన రక్షణ కోసం ఉండేవారు. ఇప్పుడు అధికార మార్పిడి నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నాయకుల భద్రతపై ప్రభుత్వం పునఃసమీక్ష నిర్వహిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mamata-banerjee-nephew-security-withdrawn-25-219497.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.