Publish Date:Nov 12, 2024
ఎంకి పెల్లి సుబ్బి చావుకోచ్చిందంటారు. అలా తయారైంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. అసలే రాష్ట్రంలో ఘోర పరాజయంతో ఇటు జనానికీ, అటు అసెంబ్లీకి ముఖం చూపించలేక ప్రెస్ మీట్లతో నెట్టుకొచ్చేస్తున్న జగన్ కు మహారాష్ట్ర ఎన్నికలు మహా డెంజర్ గా పరిణమించాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం బీజేపీకి అత్యంత అవసరం, కీలకం కూడా. అయితే ఈ ఎన్నికలలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల తరువాత మహారాష్ట్రలో సంభవించిన రాజకీయ పరిణామాలు బీజేపీ పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడటానికి కారణమయ్యాయంటున్నారు. మహాలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ ఆ రాష్ట్రంలోని రెండు అత్యంత కీలకమైన బలమైన ప్రాంతీయ పార్టీలను చీల్చింది. బీజేపీ పుణ్యమా అని రాష్ట్రంలో బలమైన శివసేన రెండుగా చీలి బలహీన పడింది. అలాగే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్డీయే కూడా నిట్ల నిలువుగా చీలి రెండు ముక్కలైంది. ఈ రెండు చీలిక వర్గాలూ కూడా బీజేపీ పంచన చేరి ప్రభుత్వంలో భాగస్వాములయ్యాయి.
ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కూటమి విజయం సాధించలేకపోతే.. శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాలకు బీజేపీతో కలిసి ఉండాల్సిన అవసరం ఉండదు. అంతే కాదు ఆ రెండు చీలిక వర్గాలకూ కలిపి లోక్ సభలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారు ఎన్డీయేలో కొనసాగుతారా లేదా అన్న విషయం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కూటమి విజయంపై ఆధారపడి ఉంటుంది. అదే ఇప్పుడు జగన్ కు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఫర్ సపోజ్ మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించలేకపోతే కేంద్రంలో ఎన్డీయే సర్కార్ చిక్కుల్లో పడుతుంది. ఎందుకంటే లోక్‌సభలో సింపుల్ మెజారిటీకి 272 స్థానాలు అవసరం కాగా, బీజేపీకి 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలుగుదేశం, జేడీయూల మద్దతుపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. మొత్తం మిత్రపక్షాలతో కలిసి లోక్ సభలో ఎన్డీయే బలం 293. ఒక వేళ మహా ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైతే శివసేన, ఎన్సీపీ ఎంపీలు ఏడుగురినీ ఎన్డీయే సభ్యులుగా భాజించలేం. అంటే ఏడుగురు సభ్యుల మద్దతును బీజేపీ కోల్పోతుంది. అంటే లోక్ సభలో ఎన్డీయే బలం 286కు పడిపోతుంది.
అంటే కేంద్రంలో బీజేపీ మరింత బలహీనపడుతుంది. ఈ పరిస్థితిని తెలుగుదేశం నిస్సందేహంగా అవకాశంగా తీసుకుని జగన్ కేసుల సత్వర విచారణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తుంది. అంటే ఫలితాల తరువాత జగన్ కేసుల విచారణ వేగం పుంజుకుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా రఘురామకృష్ణం రాజు బెయిలు రద్దు పిటిషన్ లో సీబీఐ జగన్ బెయిలు రద్దు చేయాలంటూ కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికలు జగన్ కు మహా డేంజర్ గా మారాయని రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maharashtra-elections-danger-bells-to-jagan-39-188275.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.