పవన్ కల్యాణ్ కు మహా సీఎం పరామర్శ.!

Publish Date:Jul 14, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఇటీవల ముంబైలోని  కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్‌లో   భుజానికి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. సర్జరీ పూర్తయిన అనంతరం ఆస్పత్రిలో కోలుకుంటున్న పవన్ కల్యాణ్ ను పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు కోకిలాబెన్ ఆస్పత్రికి క్యూకడుతున్నారు. అలా  పరామర్శకు వచ్చిన వారిలో జాతీయ స్థాయి నేతలు కూడా ఉండటం..  దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు దర్పణం పడుతోంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబై వెళ్లి పవన్ కళ్యాణ్‌ను కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాజాగా  మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కోకిలాబెన్ హాస్పిటల్‌కు విచ్చేసి ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు.

హాస్పిటల్‌కు చేరుకున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పవన్ కళ్యాణ్‌తో చాలా సేపు భేటీ అయ్యారు. సర్జరీ తర్వాత పవన్ ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో కూడా మాట్లాడి ఆయన ఆరోగ్యపరిస్థితిని ఆరా తీశారు.  పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య సుహృద్భావ పూరిత వాతావరణంలొ చర్చలు జరిగాయని తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని  సాధించి రికార్డు సృష్టించింది.

పవన్ కళ్యాణ్ చేసిన ఆనాటి ఎన్నికల ప్రచారం, చూపి ప్రభావానికి కృతజ్ఞతగా, ఆయనపై ఉన్న అపారమైన గౌరవంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా హాస్పిటల్‌కు వచ్చి పరామర్శించారు.  సర్జరీ నిమిత్తం ముంబై హాస్పిటల్లో చేరిన ఆయనను కలవడానికి కాగా తనను  పరామర్శించడానికి వచ్చిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు పవన్ కళ్యాణ్  ధన్యవాదాలు తెలిపారు.   

 Pawan Kalyan, Devendra Fadnavis, Pawan Kalyan Surgery, Mumbai Kokilaben Hospital, Chandrababu Naidu, Maharashtra CM Meets Pawan Kalyan

By
en-us Political News

  
ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నానక్‌రామ్‌గూడ లోని సుమధుర అక్రోపోలిస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉన్న రవీందర్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన పలు ప్రదేశా ల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ మానవతా పరామర్శను రాజకీయంగా వాడుకుంటూ వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తీవ్ర విమర్శలు అనారోగ్యంతో ఉన్న ఒక చిన్నపిల్లాడిని చూడటానికి వెళ్లడాన్ని కూడా రాజకీయ కోణంలో వక్రీకరిస్తూ వెటకారంగా మాట్లాడారు. స్వతహాగా పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఆరాధించే నిరంజన్, టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చిన పేర్ని నాని వ్యాఖ్యల వీడియోలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు.
పాతబస్తీకి చెందిన రెండు కుటుంబాలు లులు మాల్ సెల్లార్ పార్కిం గ్‌లో ఒక్కసారిగా వాగ్వాదా నికి దిగారు. గొడవ తీవ్రరూ పం దాల్చుతున్నట్లు గుర్తిం చిన మాల్ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఇరు కుటుంబాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక కుటుంబానికి చెందిన సిద్ధిఖీ అనే వ్యక్తి జేబులో తుపాకీ ఉండటాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
ఆంధ్రప్ర దేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సిట్ అధికారులు విచారణ కు పిలిచి ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఇతర రాష్ట్రానికి చెందిన సీనియర్ బ్యూరోక్రాట్‌ను విచారించ డం ఇదే తొలిసారి.
టాటా క్యాపిటల్ రూ.318 కోట్లతో యోగ్‌లోన్స్‌లో 88.6% మెజారిటీ వాటాను కొనుగోలు చేసి అధికారికంగా గోల్డ్ లోన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ భారీ డీల్ వివరాలు మరియు పసిడి రుణాల మార్కెట్ వృద్ధి గణాంకాలు ఇక్కడ చూడండి.
ప్రముఖ డచ్ ఫుట్‌బాల్ రెఫరీ రాబ్ డీపెరింక్ 38 కన్నుమూశారు. ఫిఫా వరల్డ్ కప్ 2026 అధికారుల జాబితా నుండి తొలగించిన కొద్ది వారాలకే జరిగిన ఈ విషాద సంఘటన వివరాలు మీకోసం.
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి భారత గడ్డపై విదేశీ లీగ్ మ్యాచ్! క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన BBL 2026 27 పూర్తి షెడ్యూల్ విశేషాలు, చెన్నై చేపాక్ స్టేడియంలో జరగబోయే చారిత్రక మ్యాచ్ వివరాలు ఇక్కడ చదవండి.
నేటి 14 జూలై 2026 నిఫ్టీ ప్రిడిక్షన్ మరియు కీలక సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిల పూర్తి సాంకేతిక విశ్లేషణ. మార్కెట్ బేరిష్ ట్రెండ్‌పై నిపుణుల అంచనా.
ప్రముఖ హైరింగ్ టెక్నాలజీ సంస్థ జోబిన్ (Xobin) సరికొత్త ఏఐ ఏజెంట్ నూరా (NURA) ను లాంచ్ చేసింది. కేవలం 10 నిమిషాల్లో 10 లక్షల రెజ్యూమేలను స్క్రీనింగ్ చేస్తూ, ఏఐ ఇంటర్వ్యూలు నిర్వహించే ఈ టెక్నాలజీ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికాలో ద్రవ్యోల్బణం 3.4 శాతానికి చేరడంతో వడ్డీ రేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ సంచలన హెచ్చరికలు చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నా కూడా భారీ లాభాలను అందించేందుకు సిద్ధంగా ఉన్న అనంత్ రాజ్, శోభ లిమిటెడ్, మరియు పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ షేర్ల టార్గెట్ ప్రైస్, స్టాప్ లాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఎస్సెల్ గ్రూప్ పెట్టుబడుల వివాదంలో కోటక్ మహీంద్రా ఏఎంసీ, నిలేష్ షాలపై సెబీ విధించిన రూ.2.1 కోట్ల జరిమానాను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్పేస్ ఎక్స్ SpaceX సంస్థ జూలై 16, 2026న నిర్వహించనున్న ప్రతిష్టాత్మక స్టార్‌షిప్ 13వ Starship Flight 13 ప్రయోగం గురించి పూర్తి వివరాలు. 20 సరికొత్త స్టార్‌లింక్ V3 ఉపగ్రహాలు, 407 అడుగుల భారీ రాకెట్ డేటా, మరియు గత ఫ్లైట్ 12 లోపాల నుంచి ఎలాన్ మస్క్ బృందం చేసిన అద్భుతమైన మార్పులను ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.