మా ఎన్నికలు మరోసారి గోల గోల?!

Publish Date:Sep 8, 2023

Advertisement

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు పదవీ కాలం ఆక్టోబర్ రెండో వారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆక్టోబర్ 10 తేదీన మళ్లీ మా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ అందుకు సంబంధించిన హడావుడి ఏమీ  మూవీ ఆర్టిస్ అసోసియేషన్‌లో  కనిపించకపోవడం పట్ల ఫిలింనగర్ వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి మా ఎన్నికలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే..  ఆ క్రమంలో  2021, ఆక్టోబర్ 10న  మా ఎన్నికలు జరిగాయి. ఆక్టోబర్ 13న మా అధ్యక్షుడిగా మంచు విష్ణు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 

మళ్లీ ఈ ఏడాది అంటే 2023, అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉందని.. కానీ దీనిపై ఇప్పటి వరకు టాలీవుడ్ పెద్దలు పెదవి విప్పకపోవడంపై ఆశ్చర్యం  వ్యక్తమౌతోంది.  2021లో జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ వర్గం, మంచు విష్ణు వర్గం హోరా హోరీగా తలపడ్డాయి. అందులో భాగంగా వారు సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొన్నారు. 

ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. అప్పటి  మా ఎన్నికలు  అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి.. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే తాను మా అధ్యక్షుడిగా ఎన్నికైతే... చిత్ర పరిశ్రమకు సంబంధించి పలు కార్యక్రమాలు చేస్తానంటూ ఆ సమయంలో స్పష్టమైన హామీలు  ఇచ్చారు. అయితే ఆ హామీలు ఎంత వరకు అమలు అయ్యాయన్న ప్రశ్నకు   మంచు విష్ణు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

మరి మా అధ్యక్ష పదవి కాలం అక్టోబర్‌లో ముగియనుంది. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ మా ఎన్నికల హడావుడి మొదలు కాకపోవడంపై పిలింనగర్ వర్గాలు ఓకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఈ సారి మా ఎన్నికల్లో ఎవరు బరిలో దిగుతారు? ఒ కరే నిలబడి.. మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా చేసుకుంటారా? లేక పోటీ అనివార్యమౌతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అదీకాక.. జగన్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత.. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ చాలా ఒడుదుడుకులు ఎదుర్కొంది. సినిమా థియేటర్ల టికెట్ ధరల తగ్గింపు అంశంలో జగన్ పార్టీ వ్యవహారించిన తీరు.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంతో జగన్ పార్టీపై చిత్ర పరిశ్రమ చాలా గుర్రుగా ఉందనే   ప్రచారం జరిగింది. జరుగుతోంది. మరోవైపు  ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు.. ఏపీ సీఎం జగన్‌కు సమీప బంధువు అన్న విషయం అందరికీ తెలిసిందే. 

ఇదే విషయాన్ని గత మా ఎన్నికలకు ముందు మంచు విష్ణు వివిధ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్యూలో వివరించిన విషయం కూడా తెలిసిందే.  కానీ సినిమా థియేటర్ల టికెట్ల ధరలు తగ్గింపు అంశంపై మా అధ్యక్షుడిగా మంచు విష్ణు కానీ.. ఆయన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కానీ చొరవ తీసుకొని.. ఏపీ ప్రభుత్వంతో భేటీ అయి చర్చింలేదు.  ఇటువంటి పరిస్థితుల్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు.. టాలీవుడ్ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఎక్కడ ఉన్నారనే ఓ ప్రశ్న సైతం నేటికి ఫిలింనగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

మా ఎన్నికలు మళ్లీ అక్టోబర్‌లో నిర్వహిస్తే.. అధ్యక్ష పదవికి ఎవరు నిలబడతారు? టాలీవుడ్‌లోని సమస్యలపై ప్రభుత్వంతో పోరాడే సత్తా ఉన్న వాళ్లు నిలబడతారా? లేకుంటే.. మాటల్లో తప్ప చేతల్లో హీరోయిజాన్ని ప్రదర్శించలేని వారే నిలబడతారా? అని ఫిలింనగర్ వర్గాల్లో ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది. మా ఎన్నికలకు సమయం అసన్నమవుతోన్నా.... సినిమా పెద్దల్లో మాత్రం ఉలుకు పలుకు లేకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందన్న అనుమానం కూడా ఫిలింనగర్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.