Publish Date:Oct 14, 2024
సామాజిక రుగ్మతల నివారణకు బుద్ధుని బోధనలు ఒకటే శరణ్యమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుద్ధ వనoలో ధమ్మ విజయం వేడుకలలో భాగంగా ముందుగా బుద్ధ చరిత వనములోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం నాగార్జునసాగర్ లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన బుద్ధవనం లో సామ్రాట్ అశోక చక్రవర్తి బౌద్ధ ధమ్మాని స్వీకరించిన రోజు, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకున్న రోజు అయిన అక్టోబర్ 14 సోమవారం నాడు నిర్వహించిన ధమ్మ విజయం వేడుకలలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ స్వార్థం మితిమీరి అత్యాశ తారా స్థాయికి చేరి అతలాకుతులమైన ప్రస్తుత సమాజంలో బుద్ధుని పంచశీల పాటిస్తే యుద్ధాలకు తావే లేదన్నారు. అనంతరం శాసనమండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి మాట్లాడుతూ ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండలో విలసిల్లిన బౌద్ధాన్ని ప్రస్తావిస్తూ బుద్ధ వనం రాబోయే రోజులలో అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా మారనుందన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ అన్ని హంగులతో సిద్ధమైన బుద్ధవనం రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో ఆసియాలోనే అరుదైన బౌద్ధ వారసత్వ థీమ్ పార్కుగా గుర్తింపు పొందనున్నట్లుగా తెలిపారు. మోక్షానందా బుద్ధ విహార అధ్యక్షులు ధర్మ రక్షిత బౌద్ధ దమ్మ విజయాల గురించి వివరించగా, లతా రాజా ఫౌండేషన్ సలహాదారులు పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ దమ్మ దీక్ష తీసుకున్న నేపథ్యం గురించి వివరించారు. అటుపిమ్మట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ రాబోయే రోజులలో బుద్ధ వనం ప్రత్యేక పర్యాటక స్థావరం అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు బుద్ధ వనం ప్రత్యేక అధికారి ఎన్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ధమ్మ విజయం, ధమ్మ దీక్షోత్సవాలు పర్యాటక ప్రాధాన్యత కలిగి ఈ తరానికి బౌద్ధం పట్ల అవగాహన కల్పించడానికి తోడ్పడతాయన్నారు. బుద్ధ వనం లోని ధమ్మ విజయం వేడుకలలో ఒగ్గు నృత్య కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి .ఈ కార్యక్రమంలో బుద్ధవనం అధికారులు సుధన్ రెడ్డి, ఈమని శివనాగిరెడ్డి, సూర్య ప్రకాష్ రావు, శ్యామ్ సుందర్ రావు ,మహేంద్ర హిల్స్ లోని మహాబోధి బుద్ధ విహార, మైసూర్ బైలా కుప్పే లోని మహా బోధి విహార నుండి బద్ద భిక్షువులు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇంగ్లీష్ మరియు ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కంది) 60 మంది దక్షిణ దేశాల విద్యార్థులు, బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lord-buddha-dhamma-vijayam-39-186787.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.