ఈరోజు నుంచి అమ‌లులోకి వ‌చ్చిన లాక్‌డౌన్ మినహాయింపులు!

Publish Date:Apr 20, 2020

Advertisement

సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలవుతున్న నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌క‌టించిన సడలింపులు ఈ రోజు నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి. కరోనా ప్రభావం తీవ్రంగాలేని ప్రాంతాల్లో, ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమలయ్యేలా పలు మినహాయింపులు ఇచ్చింది.

1. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేని 353 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవనోపాధి పనులు మొదలైయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ దాని అనుబంధ రంగాలు... మార్కెటింగ్‌, ఆహారశుద్ధి పరిశ్రమల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ప్రారంభానికి కేంద్రం అనుమతించింది. వీటితోపాటు మునిసిపల్‌ పరిధి బయట ఉన్న ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలకు అనుమ‌తించారు.

2. దేశంలోని 377 జిల్లాల్లో కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పనులకు వెసులుబాటు ఇచ్చారు. అన్ని వస్తువుల సరఫరాకు ఈ-కామర్స్‌ సంస్థలకు ఇటీవల మినహాయింపునిచ్చిన కేంద్రం, ఆదివారం ఈ అనుమతులను రద్దు చేసింది. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా అత్యవసర కాని వస్తువుల సరఫరా కు అనుమ‌తించ‌లేదు. అవసరమైన వాటికి మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

3. కేంద్రం మినహాయింపులు ఇచ్చినా తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా లాంటి రాష్ట్రాలు మాత్రం లాక్‌డౌన్ ఆంక్షల్ని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. కార్యకలాపాలు పునః ప్రారంభించే సమయంలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండరాదని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. వెసులుబాట్లు ఇచ్చిన ప్రాంతాల్లో ఇప్పుడున్న పరిస్థితిని యతాతథంగా కొనసాగించడానికి శాయశక్తులా ప్రయత్నించాలని సూచించింది. అవసరమని భావిస్తే కేంద్రం విధించిన ఆంక్షలకు అదనంగా మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలు విధించుకోవచ్చని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే బాగా తెలుస్తాయి కాబట్టి అదనపు జాగ్రత్తలు, చర్యలు తీసుకొనే అధికారం వాటికే వదిలిపెట్టింది.

4. నిత్యావసరాల పంపిణీ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు రద్దు.
5. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదు.
6. మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంలు మూసివేస్తారు.
7. సామాజిక, రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం.
8. మతప్రదేశాలలో పెద్ద ఎత్తున ప్రార్థనలపై నిషేధం.
9. ట్యాక్సీ సర్వీసులకు అనుమతి లేదు.
10. హాట్‌స్పాట్స్‌, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిలేదు. హాట్‌స్పాట్స్, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. నిత్యావసరాల పంపిణీ మినహా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఉండవు.
11. ఆరోగ్య కేంద్రం, ఔషధాల విక్రయాలు యధాతథంగా సాగుతాయి. ఔషధ పరిశ్రమలలో ఉత్పత్తికి అనుమతులు.
12. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలు. వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే పరిశ్రమలు ఆక్వా ఉత్పత్తులు క్రయ విక్రయాలకు అనుమ‌తి.
13. బ్యాంకు కార్యకలాపాలకు అలాగే, వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు నిర్వహణకు ఎలాంటి ఆంక్షలు లేవు.
14. ఉపాధి హామీ పనులు, భవన నిర్మాణ పనులు.. సమీపంలో ఉన్నవారితోనే పనులు చేపట్టాలి. ఉపాధి కూలీలు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి.
15.ఎరువులు, పురుగుల మందులు, విత్తనోత్పత్తి దుకాణాలు తెరుచుకుంటాయి.
16. పాల ఉత్పత్తులు, వ్యాపారాలు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగుకు అనుమ‌తి.
17. జాతీయ రహదారులు పక్కన దాబాలు, వాహన మరమ్మత్తుల దుకాణాలకు కేంద్రం అనుమతించింది.
18. ఐటీ సంస్థల్లో 50 శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతి.
19. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యథాతథం.
20. వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి.
21. ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్‌మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతి
22. రక్షణ, పారామిలటరీ, ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ, విపత్తు నిర్వహణ, ఎన్ఐ‌సీ, ఎఫ్‌సీఐ, ఎన్‌సీసీ, యువ కేంద్రాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.
23. మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాల్లోని డిప్యూటీ సెక్రెటరీలు అంతకంటే ఎక్కువస్థాయి అధికారులు 100 శాతం హాజరుకావాలి.. మిగతా అధికారులు, ఇతర సిబ్బంది 33 శాతం వరకూ ఆఫీసులకు హాజరుకావాలి.
24. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం సహా గుట్కాలు, ఖైనీ, మద్యపానం నిషేధం. ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే శిక్షార్హులవుతారు.
25. పనులు ప్రారంభించే భారీ పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక సముదాయాల ప్రాంగణాల్లోనే కార్మికులకు వసతి సౌకర్యాలు కల్పించ‌డానికి అనుమ‌తి.
26. గుట్కా, పాన్‌ మసాలాలు, నమిలే పొగాకు, సిగరెట్ల అమ్మకాలను మే 3వ తేదీ వరకు పూర్తిస్థాయిలో నిషేధం అమలవుతుంది.
27. దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చే వారంతా మాస్క్‌లు ధరించాల్సిందే. ఇందులో మినహాయింపు లేదు. పనిచేసేందుకు అనుమతించిన ప్రాంతాల్లోనూ మాస్కులు, శానిటైజర్‌ల వినియోగించాలి. థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రాలు తప్పనిసరి.
28. ప్రజా రవాణాకు అవకాశం లేదు. కారులో ఇద్దరు, బైక్‌పై ఒక్కరే!
జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు బంద్‌.
29. అన్ని విద్యా సంస్థలు, కోచింగ్‌ సంస్థలను మూసివేయాల్సిందే.
30.దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నీ బంద్‌. రైళ్లు, మెట్రో, ప్రజారవాణాకు సంబంధించిన బస్సులు తిరగవు.

By
en-us Political News

  
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.