Publish Date:Nov 15, 2024
హైద్రాబాద్ శాలిబండ మండలంలోని గాజిబండలో ప్రతీ కుటుంబంలో ఎవరో ఒకరు విదేశాలకు వెళుతున్నారు. సిరాజ్ కు ఇది నచ్చలేదు. ఇండియాలో ఉండిపోవాలనుకున్న తనకు ఇది ఇబ్బందిగా పరిణమించింది. ఒక రోజు మౌలా దగ్గరికి వచ్చాడు. తన అనుమానాన్ని నివృత్తి చేసుకున్నాడు. మౌలానా లోకం పోకడలను కూలకషంగా చెప్పాడు. మౌలానా తక్రీర్( ప్రవచనం) ప్రారంభించాడు. అల్లా చెప్పేది ఒకటే . అల్లా తలచుకుంటే ఒక్కసెకనులో అన్నీ గుంజేసుకుంటాడు. పులికి ఒక మంచి జీవితం ఉంది. బాగా ఆకలేస్తే మంచి జింకను వేటాడి తింటుంది. మనుషులు జంతువులు ఒకేలా జీవించగలవు. నాణ్యమైన జీవితం కోసం మనుషులు విదేశాలకు వెళుతుంటారు. పులి లేదా సింహానికి సమయానికి బలవర్ధకమైన జింక మాంసాహారం అవసరం. ఆయా సీజన్ బట్టీ గుహ అవసరం. ఎండాకాలం, వానా కాలం , వర్షా కాలం బట్టి గుహలు ఏర్పరచుకుంటాయి. పిల్లి తన పిల్లి కూనలు పుట్టిన తర్వాత వాటిని సాకడానికి నానా హైరానా పడుతుంది. ఇల్లు కూడా మార్చేస్తుంది. కుందేలు కూడా అదే విధంగా చేస్తుంది.తన శరీరం మీద ఉన్న వెంట్రుకలను తీసి మెత్తటి కార్పెట్ మాదిరిగా తయారుచేస్తుంది. తన పిల్లలను వెచ్చగా పడుకోబెడుతుంది. మనుషులు చదువు వల్ల మంచి ఉద్యోగం ఇవన్నీ మన శరీరాన్ని కాపాడుకోవడం కోసమే. జంతువులు కూడా శరీరాన్ని కాపాడుకుంటున్నాయి. ఒక రోజు అడవిలో సింహం పెళ్లి జరిగింది. సింహం మనుషుల మాదిరిగా ఆలోచిస్తే మరోలా ఉంటుంది. సింహం పెళ్లిలో ఏనుగు, చిరుతపులి, ఎలుగుబంటి, జిరాఫీ వంటి జంతువులను మాత్రమే ఆహ్వానిస్తుంది. నా బరాత్ లో అల్ప జీవులు రాకూడదని కోరుకుంది. ఒక రోజు చిట్టెలుక సింహం పెళ్లిలో కనిపిస్తుంది. సింహానికి కోపం వస్తుంది. చిట్టెలుకను నిలదీస్తుంది. నువ్వెందుకు వచ్చావని అడుగుతుంది. అప్పుడు చిట్టెలుక కూల్ గా జవాబిస్తుంది. పెళ్లికి ముందు నీ లాగే (సింహం) ఉండే వాడిని. పెళ్లయిన తర్వాత ఎలుక అవతారమెత్తాను. మనుషులు ప్రకృతికి విరుద్దంగా ఆలోచిస్తున్నారు. దంపతులు ఈ మధ్య కాలంలో ఇద్దరు పిల్లలు పుడితే ఎలా అని టెన్షన్ పడుతున్నారు. నాకు తెలిసిన ఈ జంటకు పదేళ్లుగా పిల్లలు కలగలేదు. అయినా టెన్షన్ పడుతున్నారు. పక్షులు, జంతువులు కేవలం తమ ఆహార అన్వేషణ సాయంత్రం వరకే . చీకటి పడకముందే గూట్లో కి వచ్చి నిద్రపోతాయి. మళ్లీ తెల్లవారిన తర్వాత మళ్లీ వేట ప్రారంభిస్తాయి.ఆహార అన్వేషణ తప్పితే వేరే ఆలోచనలు ఆ జీవాలకు ఉండవు. కనుక వాటికి బీపీ, షుగర్ వంటి వ్యాధులు దరి చేరవు. మనిషి గతం నెమరేసుకుని బాధపడతాడు. భవిషత్తు గూర్చి ఆందోళన చెందుతాడు. వర్త మానంలో జీవిస్తే ఉన్న సుఖం మరెక్కడా ఉండదు.
బదనపల్లి శ్రీనివాసాచారి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/live-in-the-present-39-188425.html
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.