పిల్లలకు 5 ఏళ్ల లోపే ఈ 5 విషయాలు నేర్పిస్తే వారి భవిత బంగారం..!

Publish Date:Jun 4, 2025

Advertisement

పిల్లల పెంపకం ఒక కళ.  చాలామంది పిల్లలకు ఆహారం ఇవ్వడం, వారికి కావలసిన వస్తువులు సమకూర్చడం,  చదువు చెప్పించడం మొదలైనవి చేయడమే పిల్లల పెంపకం అనుకుంటారు. కానీ ఇవన్నీ పిల్లలకు అవసరమైనవి.. ఇవి మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే విషయాలు కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. కొన్ని పద్దతులు,  విలువలు అలవాటు చెయ్యాలి.  5ఏళ్ల లూపే పిల్లలకు పిల్లలకు 5 విషయాలు తప్పక నేర్పిస్తే పిల్లలు వాటిని  జీవితాంతం వాటిని వదిలిపెట్టరు. అది వారి జీవితాన్ని బంగారంలా మారుస్తుంది.

పిల్లలు దుఃఖం, బాధ, కోపం, సంతోషం మొదలైన భావోద్వేగాలను చాలా తొందరగా వ్యక్తం చేస్తారు. అయితే వీటిని వ్యక్తం చేసే విధానం ఒకటి ఉంటుంది.  ఆ విధానంలో వ్యక్తం చేయడం నేర్పిస్తే పిల్లలు దృఢంగా ఉంటారు.  దీన్ని 5 ఏళ్లలోపే పిల్లలకు నేర్పించాలి.

ఇతరులను గౌరవించడం గొప్ప గుణం.  దీన్ని చిన్నతనం నుండే పిల్లలకు నేర్పించాలి.  భావోద్వేగాలు ఎంత ఉన్నా, ఎంత కోపం,  అసహనం ఉన్నా   ఇతరులను అవమానించి మాట్లాడకూడదని,  ఒకచోట కోపాన్ని ఇంకొక చోట తీసుకురాకూడదని చెప్పాలి.

 తప్పులు ఎప్పుడూ అనుభవాలుగా,  గొప్ప పాఠాలుగా సహాయపడతాయి.  అయితే పిల్లలు మాత్రం తప్పు చేస్తే తప్పించుకోవడం, దాచిపెట్టడం చేస్తారు. కానీ పిల్లలు తాము చేసిన తప్పుల నుండి తప్పించుకోకుండా, దాచిపెట్టకుండా  వాటిని ఒప్పుకునేలా అలవాటు చెయ్యాలి.

తాము తప్పు చేసినా, ఇతరులను నొప్పించినా పరిస్థితులకు అనుగుణంగా సారీ చెప్పడం, కృతజ్ఞత వెలిబుచ్చడానికి  థ్యాంక్స్ చెప్పడం  వంటివి పిల్లలకు నేర్పించాలి. ఎవరైనా తమను బాధపెడితే వారిని  క్షమించే తత్వాన్ని పిల్లలకు నేర్పించాలి.

సమస్యలు అందరికీ వస్తాయి.  వయసుకు తగిన సమస్యలు ఉండనే ఉంటాయి.  అయితే  పిల్లలకు ఏ సమస్య వస్తుందో అని పెద్దలు ఎప్పుడూ గాభరా పడుతూ ఉంటారు.కానీ ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం కోసం పిల్లలే ఆలోచించేలా వారికి అలవాటు చెయ్యాలి.  ఇది వారి భవిష్యత్తును అందంగా మారుస్తుంది. ఒకరి మీద ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో లీడర్ షిప్ క్వాలిటీస్ పెరగడానికి దోహదం చేస్తుంది.


                                                     *రూపశ్రీ.

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.