క్రీ.పూ.1000 ఏళ్లనాటి నిలువురాయి
కాపాడుకోవాలంటున్న ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరెడ్డి
సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ మండలం, మటంపల్లిలో ఇనుపయుగపు ఆనవాళ్లున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కొత్త తెలంగాణా చరిత్ర బృందం సభ్యులు, అహోబిలం కరుణాకర్, నసీరుద్దీన్, చంటి ఇచ్చిన సమాచారం మేరకు గురువారం నాడు, ఆయన మటంపల్లి పాత శివాలయం దారిలో రోడ్డు పక్కనే ఉన్న 12 అడుగల ఎత్తు, 5 అడుగల వెడల్పు, 6 అంగుళాల మందం ఉన్న నిలువురాయి (స్మారకశిల)ని క్షుణ్ణంగా పరిశీలించి మటంపల్లి క్రీ.పూ.1000 ఏళ్ల నాటి ఇనుపయుగపు స్థావరమని చెప్పారు.
ఆకాలంలో మరణించిన వారిని ఒక గుంటలో పూడ్చి, పైన మట్టితో కప్పి, గుర్తుగా ఒక స్మారక శిలను నిలిపే ఆచారముండేదని, అందులో భాగంగానే ఈ నిలువురాతిని ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పారు. పురావస్తు, చారిత్రక ప్రాధాన్యతగల ఈ నిలువురాయిని కాపాడుకోవాలని మటంపల్లి గ్రామస్థులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన హుజూర్‌నగర్ బార్‌కౌన్సిల్ అధ్యక్షులు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సాముల రామిరెడ్డికి శివనాగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/land-marks-on-iron-age-in-matham-palli-25-192458.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.