లడ్డూ ప్రసాదం... వైసీపీ వింత ప్రకటనలు!

Publish Date:Sep 23, 2024

Advertisement

పరమ పవిత్రమైన తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి సర్వప్రయత్నాలు చేస్తోంది. అధికారం వెలగబెట్టిన కాలంలో జగన్ ప్రభుత్వం చేసిన ఈ దౌర్భాగ్యపు పనిని యావత్ దేశం అసహ్యించుకుంటోంది. లడ్డూని తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడటం వల్ల హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విషయంలో కేవలం హిందువులు మాత్రమే జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. ఇతర మతాల వారు కూడా ఈ ఘోరాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏ మత విశ్వాసాన్నీ ఇంత దారుణంగా దెబ్బతీయకూడదని అంటున్నారు. జాతీయ మీడియా అయితే జగన్‌ని ఫుట్‌బాల్ ఆడుకుంటోంది. ఒక్క లడ్డూ విషయంలో మాత్రమే కాకుండా అధికారాన్ని వెలగబెట్టిన సమయంలో జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాల చిట్టాని బయటకి తీసి కథనాలుగా అందిస్తోంది.  స్వామివారి లడ్డూని అపవిత్రం చేసిన పాపం జగన్ రాజకీయ కెరీర్‌నే సమాధి చేసే శాపంలా మారింది. ఇంత జరిగినా వైసీపీ నాయకులు తప్పుని ఒప్పుకోకుండా తప్పించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. కానీ, ఆ ప్రయత్నాల సందర్భంగా వాళ్ళు చేస్తున్న తప్పులు జనానికి మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి మనోవేదన చెందిన ఏపీ డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ఈ దీక్ష మీద కూడా వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. పవ‌న్‌ టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అందులో ప్రధానంగా పేర్కొంటున్న కామెంట్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ ఒకసారి తన తండ్రి కొణిదెల వెంకట్రావు గురించి చెబుతూ, తన తండ్రి దీపారాధనతో సిగరెట్ వెలిగించుకునేవారని చెప్పారు. అలాంటి తండ్రికి పుట్టిన కొడుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందూ మతానికి అన్యాయం జరుగుతోందని బాధపడుతున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి కామెంట్లు పెట్టడం ద్వారా వైసీసీపీ నాయకులు తమ లేకితనాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ తండ్రి ఏదో చేస్తే, ఆయన కొడుకు హిందూ మత విశ్వాసాల గురించి మాట్లాడ్డమేంటని అనడం అజ్ఞానానికి అతిపెద్ద ఆనవాలు. తండ్రి అలా అయినంతమాత్రాన కొడుకు కూడా అలాంటి వాడేనా? ఆ లెక్కకొస్తే, జగన్ తాత వైఎస్ రాజీరెడ్డి బ్రిటీష్ వాళ్ళకి పంది మాంసం సరఫరా చేసేవాడు. అలాంటి తాతకు మనవడు కాబట్టి జగన్ పందికొవ్వు కలసిన నెయ్యితో స్వామివారి లడ్డూలు చేయించారని అనుకోవచ్చు కదా. ఒక కామెంట్ చేసేముందు ముందూ వెనుకా ఆలోచించే అలవాటు ఈ వైసీపీ వాళ్ళకి జీవితంలో రాదు! ఈ మేటర్ ఇంకా వుంది. పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావు దీపారాధన దీపంతో సిగరెట్ వెలిగించుకున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఒకసారి పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలా దీపారాధనతో సిగరెట్ వెలిగించుకున్న నాస్తికుడైన తన తండ్రి ఆ తర్వాత రామభక్తుడిగా మారిపోయారని, నిరంతరం రామనామాన్ని జపిస్తూ వుండేవారని, తాను అజ్ఞానంతో చేసిన తప్పుని జీవితాంతం గుర్తు చేసుకుని బాధపడుతూ వుండేవారని చెప్పారు. ఈ వైసీపీ మూకలు ఇదంతా వదిలేసి ‘పవన్ కళ్యాణ్ తండ్రి దీపారాధన దీపంతో సిగరెట్ వెలిగించుకున్నాడు’ అంటూ ప్రచారం చేయడంలో బిజీగా వున్నాయి.

ఇక వైసీపీలో వున్న మరో కళాకారుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన ఒక గొప్ప కామెంట్ గురించి కూడా మనం చెప్పుకుని తరించాలి. నెయ్యిలో పంది కొవ్వు కలవటం గురించి ఆయన చేసిన కామెంట్లు వింటే, ఆయన బుర్రని ఏ మ్యూజియంలో పెట్టాలా అనే ఆలోచన ఎవరికైనా వచ్చితీరుతుంది. ఆయన చెబుతున్నదాని ప్రకారం... ‘‘ఆవు నెయ్యి రేటు రాగి లాంటిది. అదే పంది కొవ్వు ధర బంగారం లాంటిది. అలాంటప్పడు రాగిలాంటి ఆవు నెయ్యిలో బంగారం లాంటి పంది కొవ్వు ఎందుకు కలుపుతారు?’’ ఇదీ ఆయన వెర్షన్. ఆవు నెయ్యికంటే పంది కొవ్వే విలువైనది అని చెబుతూ తాము చేసిన తప్పును అడ్డదిడ్డంగా సమర్థించుకుంటున్న పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆ వైఎస్ జగన్‌కి అసలు సిసలు ఫాలోవర్. ఈ మేటర్‌కి ముక్తాయింపు ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి వేడి వేడి కల్తీ నెయ్యిలో పడ్డారు. ఇక అందులో మునిగిపోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.

By
en-us Political News

  
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.