లడ్డూ కల్తీ.. సుప్రీం తీర్పుపైనే అందరి దృష్టీ!

Publish Date:Oct 2, 2024

Advertisement

లడ్డూ వివాదం సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కొత్త రూపు సంతరించుకుంది. సీఎం ప్రకటనతో ప్రారంభమై అన్ని రాజకీయపార్టీ నాయకుల వ్యాఖ్యలు,ఆందోళనలతో రాజకీయ రంగుపులుముకుని వేడి పుట్టింది. ఒక దశలో సీఎం, మాజీ సీఎంల మధ్య రాజకీయపోరాటమా  అనిపించింది. ఆధారాలు లేకుండా రాజ్యాంగ పదవిలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ ప్రకటన చేయడం శ్రీవారి కోట్లాది భక్తుల మనోభావాలకు భంగం కలిగిందని  సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం, లడ్డూలో కల్తీ జరిగిందనటానికి ఆధారాలు మీ దగ్గర ఏమి ఉన్నాయి అని ప్రశ్నించడంతో అందరి దృష్టీ గురువారం (అక్టోబర్ 3) ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు  వెలువరించనున్న తీర్పుపైనే కేంద్రీకృతమైంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య స్వామి వేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.  సుప్రీం తుది తీర్పు ఇవ్వకుండానే విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి.   కూటమి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే వైసీపీ ముందస్తు సంబరాలను న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. తొందరపాటు అని అభివర్ణిస్తున్నారు. విచారణ సందర్భంగా కోర్టు కొన్ని ప్రశ్నలు సంధించిందనీ, గురువారం ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనను వివరించాల్సి ఉందనీ అంటున్నారు.

కాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ హుందాగా వ్యవహరించిందని చెప్పవచ్చు. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపధ్యంలో లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసింది. సుప్రీం కోర్టు సిట్ విచారణను నిలుపుదల చేయాలని ఆదేశాలు ఏమీ ఇవ్వలేదు. సీఎం ప్రకటనపైనే వ్యాఖ్యానించింది.  అయినా తెలుగుదేశం ప్రభుత్వం సిట్ విచారణ నిలుపుదల చేయాలని నిర్ణయించింది.  

వైసీపీ హయాంలో తిరుమలలో అనేక అవకతవకలు జరిగిన నేపధ్యంలో అక్కడి సిబ్బంది,భక్తుల నుంచి లడ్డూ  నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులు, కనీసంరూ.800 ఉన్న ఆవునెయ్యి కిలో 320రూపాయలకు సరఫరా చేయడంతో కల్తీ జరిగిందనేది అనుమానాలు పొడసూపాయి. రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదాన్ని కోర్టు ఏలా పరిష్కరిస్తుందనేది వేచిచూడాలి.  

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.