మారారా.. మారినట్లు నటిస్తున్నారా?.. సోము వీర్రాజుపై కూటమి పార్టీల్లో అనుమానాలు!

Publish Date:Mar 12, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ బెర్త్ లభించడం, ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమంలో హై డ్రామా చోటు చేసుకోవడం మారిపోయింది.  బీజేపీ అడిగింది సరే.. చంద్రబాబు ఎలా అంగీకరించారు? గత ఎన్నికల సమయంలో సోము వీర్రాజు, జీవీఎల్ వంటి వారు పొత్తులో భాగంగా బీజేపీ తరఫున పోటీకి చేసిన ప్రయత్నాలను గట్టిగా అడ్డుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పుడు సోముకు బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడాన్ని ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకడం పక్కన పెడితే.. అసలు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ బెర్త్ లభించడం తెలుగుదేశం క్యాడర్ ను తీవ్ర నిరాశకు గురి చేసిందనడంలో సందేహం లేదు.

ఒక్క తెలుగుదేశం క్యాడర్ నే కాదు, జనసేన శ్రేణులు కూడా సోముకు ఎమ్మెల్సీ బెర్త్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆఖరికి బీజేపీలో కూడా సోముకు టికెట్ పై నిరాశ, నిస్ఫృహలు వ్యక్తం అవుతున్నాయి.  2014-19లో  చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ సోము వీర్రాజు  తెలుగుదేశంకు వ్యతిరేకిగా వ్యవహరించారు, ఆ తరువాత 2019-24 మధ్య అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వంతో అంటకాగారు. జగన్ చెప్పినట్లల్లా వ్యవహరించారు.  అప్పట్లో సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, జివిఎల్ నరసింహారావు తదితరులు టీడీపీకి బద్ధ వ్యతిరేకులుగా వ్యవహరించారు. అంతే కాదు 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం, బీజేపీ పొత్తును వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే..  2018లో  తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు రావడానికి ఒక విధంగా సోము వీర్రాజు అండ్ కో యే కారణం. 

సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయన వ్యవహరించిన తీరును బీజేపీ రాష్ట్ర నాయకులే వ్యతిరేకించారు. పార్టీ అధిష్ఠానానికి సోముపై ఫిర్యాదులు చేశారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య చక్కటి సమన్వయం ఉన్న సమయంలో మళ్లీ సోము వీర్రాజును ఎమ్మెల్సీ చేయాలని బీజేపీ హైకమాండ్ భావించడం, దానిని చంద్రబాబు అభ్యంతరం లేకుండా ఆమోందించి అంగీకరించడంతో కూటమి పార్టీల శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. 

ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన తరువాత  సోము వీర్రాజు మీడియాతో మాట్లాడిన మాటలను విశ్వసించలేకపోతున్నాయి. మీడియాతో మాట్లాడుతూ.. సోము వీర్రాజు తాను సుద్దపూసనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. తాను మునుపటి వీర్రాజును కాననీ, పూర్తిగా మారిపోయాననీ నమ్మించడానికి ప్రయత్నించారు. తనకు చంద్రబాబుతో చక్కటి అనుబంధం ఉందని చెప్పుకున్నారు. చంద్రబాబుతో తన అనుబంధాన్ని మోడీ, చంద్రబాబుల మధ్య ఉన్న అనుబంధంతో పోల్చారు. అక్కడితో ఆగకుండా.. తాను జగన్ కోవర్టును కాననీ, అసలు జగన్ 2019లో సీఎం అయ్యే వరకూ ఆయనెవరో కూడా తనకు తెలియదనీ చెప్పుకున్నారు. 
అమరావతిని తాను వ్యతిరేకించానంటూ జరిగిన ప్రచారం నిజం కాదనీ, తానెప్పుడూ అమరావతికి మద్దతుగానే నిలిచాననీ నమ్మబలకడానికి ప్రయత్నించారు.  అయితే ఇంతగా సోము వీర్రాజు తాను జగన్ కోవర్టును కాదని చెప్పుకోవడానికి ప్రయత్నించినా తెలుగుదేశం క్యాడర్ కానీ, జనసేన శ్రేణులు కానీ నమ్మడం లేదు. సోము వీర్రాజులో మార్పు నిజమేనా, లేక  తాను మారానని నమ్మించడానికి ఆస్కార్ స్థాయిలో ఆయన నటిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం కేంద్రంలోని మోడీ సర్కార్ మనుగడ పూర్తిగా చంద్రబాబుపై అంటే తెలుగుదేశం పార్టీకి లోక్ సభలో ఉన్న సంఖ్యాబలంపై ఆధారపడి ఉంది. అందుకే సోము వీర్రాజు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయగానే చంద్రబాబు ఆశీర్వాదం కోసం పరుగెత్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు కూడా సోము వీర్రాజుకు ఆ సందర్భంగా గట్టి హెచ్చరికే చేశారని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సహా కూటమి పార్టీలేవీ సోము వీర్రాజును విశ్వసించడం లేదనీ, ఆయనలో మార్పు వచ్చిందని నమ్మడం లేదనీ పరిశీలకులు అంటున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ మనుగడ తెలుగుదేశంపై ఆధారపడి ఉంది కనుక సోము గతంలోలా తోక జాడించలేరనీ, జగన్ కోసం పని చేయలేరనీ అంటున్నారు. మొత్తం మీద ఆయన కూటమి పార్టీల నిఘాలోనే ఉంటారనడంలో సందేహం లేదు.  

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.