ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి.. కుల రాజకీయాలకు తెరలేపిన జగన్.!

Publish Date:Aug 14, 2026

Advertisement

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఫస్ట్రేషన్ లో ఉన్నారా? ఆ కారణంగానే కుల రాజకీయాలకు తెరలేపి రాజకీయ లబ్ఢి పాందాలని ప్రయత్నిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో ప్రగతి పరుగులు తీస్తుండటం, మెగా డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ తన పిలుపు మేరకు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు ప్రజల నుంచి స్పందన కరవవ్వడంతో జగన్ లో  ఫస్ల్రేషన్ పీక్స్ కు చేరిందని అంటున్నారు. అందుకే ఆయన కుల రాజకీయాలకు తెరలేపి లబ్థి కోసం అర్రులు చాస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఆయన  వ్యూహాలు, వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ముఖ్యంగా గతంలో తాను అధికారంలో ఉన్న సమయంలో  వైసీపీకి చెందిన కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆరోపణలు, అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. స్వయంగా జగన్ పైనే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అన్న ఆరోపణలు ఉన్నాయి.  2024 ఎన్నికలలో విజయం సాధించి చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి  అధికారంలోకి వచ్చిన తర్వాత.. చట్టబద్ధమైన చర్యల్లో భాగంగా పోలీసులు జగన్ హయాంలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన కేసుల వచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో అరెస్టులు జరుగుతున్నాయి. అయితే ఈ అరెస్టులు, న్యాయపరమైన చర్యలు జగన్ లో అసహనాన్ని పెంచుతున్నాయని అంటున్నారు.   పార్టీ నేతలకు మద్దతుగా మాట్లాడే క్రమంలో జగన్ హద్దు మీరుతున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.  నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి అరెస్టుల విషయంలో జగన్ కుల రాజకీయాలకు తెరలేపుతున్నారంటున్నారు.  

తాజాగా కర్నూలు జిల్లా జైలులో  రిమాండ్‌ ఖైదీగా  ఉన్న వైసీపీ నేత  విరూపాక్షిని జగన్ పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.

ఈ నేపథ్యంలో జగన్ కర్నాలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విరూపాక్షను ములాఖత్  ద్వారా కలిసి పరామర్శించారు.  అనంతరం జైలు బయట  జగన్ మీడియా సమావేశంలో  చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బలహీన వర్గాలను, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను అణచివేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా  బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. 

నేరాలకు పాల్పడిన వారు అరెస్టైతే.. కులం పేరెత్తడమేంటని నెటిజనులు జగన్ వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.  వీడియో ఆధారాలతో సహా ప్రత్యక్షంగా నేరానికి పాల్పడినట్లు  కనిపించిన సంఘటనల్లో నేరస్థులను వెనకేసుకు రావడానికి కులం కార్డు ఉపయోగించడం సరి కాదని విమర్శిస్తున్నారు.  ఒక వ్యక్తి  నేరం చేశాడా లేదా అనేదే చట్టం ముందు ముఖ్యమని,  కులాన్ని ఆధారం చేసుకుని నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలవడం సరి కాదనీ అంటున్నారు. . గతంలో వైకాపా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విషయంలో కూడా జగన్ ఇదే తీరున వ్యవహరించిన సంగతి గుర్తు చేస్తున్నారు.   

Kurnool Jail, Virupakshi, Seediri Appalaraju, Andhra Pradesh politics, NDA government, TeluguOne News, Jagan casterelated remarks

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.