కర్నూలులో కాల్పుల కలకలం.!

Publish Date:Jul 26, 2026

Advertisement

 

కర్నూలులో ఆదివారం (జులై26) కాల్పులు కలకలం రేపాయి.  కర్నూలులోని  ద్ధ వీఆర్‌ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీ   సమీపంలో జరిగిన ఈ ఘటన ఆందోళన రేపింది.  కారులో వచ్చిన ఇద్దరు అగంతకులు.. హఠాత్తుగా గాలిలోకి కాల్పులు జరిపారు. కర్నూలు  బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్' టోర్నమెంట్ ముగింపు వేడుకల వేళ ఈ దుర్ఘటన జరగడం స్థానికంగా పెద్ద కలకలాన్నే రేపింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని, భయాందోళనలో ఉన్న స్థానిక ప్రజలకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను, బుల్లెట్ అవశేషాలను సేకరించేందుకు క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించారు.  

విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు కర్నూలు బ్యాడ్మంటన్ లీగ్ పోటీల ఫైనల్స్ లో   అశోక్ నగర్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి కౌశిక్ నేతృత్వంలోని టీమ్   ఓటమి పాలైంది. మ్యాచ్ ఓడిపోవడంతో మద్యం సేవించిన  కౌశిక్, అతడి మిత్రులు  కర్నూలు నివాసి శ్రీకుమార్ రెడ్డితో  గొడవకు దిగారు.  దీంతో  నిర్వాహకులు, స్థానికులు చొరవ తీసుకుని గొడవ పడుతున్న వారిని వారించి అకాడమీ నుంచి బయటకు పంపించివేశారు.

అయితే అకాడమీ నుంచి బయటకు వచ్చిన కౌశిక్  ప్ర రివాల్వర్‌తో విచక్షణారహితంగా గాల్లోకి 2 రౌండ్లు, నేలపైకి 1 రౌండ్ చొప్పున మొత్తం 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో కొందరు  స్థానికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటనతో చాణక్యపురి కాలనీ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కర్నూలు త్రీటౌన్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.  రచ్చ సృష్టించిన కౌశిక్‌తో పాటు ఆయన మిత్రుడు అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రాథమిక విచారణలో కౌశిక్‌కు రివాల్పర్ లైసెన్స్ ఉన్నట్లు గుర్తించారు.

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా నిర్వహిస్తున్న పోలీసులపై ఓ యువకుడు కారుతోనే దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం
మానవ మెదడు తరంగాలు Brain Waves ఫిజికల్ ఏఐ రంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తున్నాయి. ఆలోచనల ద్వారా రోబోలను నియంత్రించే అధునాతన సాంకేతికత మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
బ్లూటూత్ సెక్యూరిటీ లోపాల వల్ల ఏకంగా 22 లక్షల కార్లు హ్యాక్ అయ్యే ప్రమాదంలో ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. KARR యాంటీ థెఫ్ట్ సిస్టమ్ ద్వారా కారు డోర్లు అన్‌లాక్ చేసే ముప్పుపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆనంద్ రాఠీ వెల్త్ Q1 FY27 ఆర్థిక ఫలితాలలో 24% లాభాల వృద్ధితో రూ. 116 కోట్ల నికర లాభాన్ని మరియు రూ. 1.06 లక్షల కోట్ల AUM మైలురాయిని సాధించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఎంఆర్‌ఎఫ్ MRF కంపెనీలో ప్రమోటర్ కుటుంబం ఎంత వాటా కలిగి ఉందో తెలుసుకోండి. మామ్మన్ ఫ్యామిలీ, రిటైల్ ఇన్వెస్టర్లు మరియు FIIల షేర్‌హోల్డింగ్ వివరాలతో కూడిన సమగ్ర కథనం!
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్‌నినో పరిస్థితులను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తూ రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు జూలై 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరగనున్నాయి
టీ20 ఫార్మాట్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు మెరుపు ఆరంభం ఇవ్వడమే తన లక్ష్యమని సూర్యవంశీ చెప్పాడు. ఈ సిరీస్ లో సూర్యవంశీ రెండు హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గత నాలుగేళ్లుగా సరికొత్త రికార్డులు సృష్టించిన ఆపిల్ ఐఫోన్ సేల్స్ 3% క్షీణించాయి. ఐఫోన్ 17 స్టాక్ కొరత, మార్కెట్ సవాళ్లు మరియు భారతదేశంలో ఆపిల్ సాధిస్తున్న బిలియన్ డాలర్ల ప్రయాణంపై సమగ్ర కథనం ఇక్కడ చదవండి.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్, యువ సంచలనం, బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఆట స్వరూపాన్నే మార్చివేశాడు. వైభవ్ మైదానం నలుమూలలా విరుచుకుపడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు సాధించాడు.
నిఫ్టీ 50 సూచీ ప్రస్తుతం ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉంది. 23,600 మద్దతు నిలిస్తే 24,000 వరకు పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్ర శ్రేణి విశ్లేషకులు సూచించిన ఆప్షన్ స్ట్రాటజీలు మరియు లాభదాయకమైన 6 స్టాక్ రికమండేషన్లు ఇక్కడ చూడండి.
546 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లపై ఎకనామిక్ టైమ్స్ చేసిన సమగ్ర విశ్లేషణలో SIP రాబడుల్లో ఫార్మా మరియు హెల్త్‌కేర్ సెక్టోరల్ ఫండ్లు అగ్రస్థానంలో నిలిచాయి. లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్లను మించి ఇవి ఏ విధంగా మెరుగైన ఫలితాలు ఇచ్చాయో పూర్తి వివరాలు తెలుసుకోండి.
హైదరాబాద్ సబ్‌జూనియర్ బాస్కెట్‌బాల్ లీగ్ 2026లో సికింద్రాబాద్ స్టాలియన్స్ చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. 105-72 తేడాతో గోల్కొండ గ్లాడియేటర్స్‌పై గెలిచి 100 పాయింట్ల మార్కు దాటిన మొదటి జట్టుగా ఫైనల్‌కు చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.