Publish Date:Jul 10, 2026
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేటీఆర్ తన పాదయాత్ర ప్రకటించారు. ఆయన ప్రకటించిన మేరకు ఈ ఏడాదే ఆయన పాదయాత్ర ప్రారంభించాలి. కానీ నుంచే ఈ మహా యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. తన పాదయాత్ర ద్వారా పార్టీకి ఏ మేరకు మైలేజ్ వస్తుంది.. పార్టీ అధికారంలోకి రావడానికి తన పాదయాత్ర ఏంతగా దోహదపడుతుంది వంటి వివరాలను ఆయన క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిచి ఆ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక పాదయాత్రపై కుటుంబ సభ్యులతో కూడా చర్చించారు. ఇన్నీ చేసి ఇక పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేయడమే తరువాయి అని పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చిన కేటీఆర్ ఇప్పుడు పాదయాత్రను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.
ఈ ఏడాదే పాదయాత్ర ప్రారంభిస్తానని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేని ఈ సమయంలో పాదయాత్ర చేయడం వల్ల ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేదన్న భావనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వచ్చే ఏడాదికి వాయిదా వేసుకున్నారంటున్నారు. కాగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టదలచిన బస్సు యాత్రను కూడా ఇదే కారణంతో నిరవధికంగా వాయిదా వేసుకున్నారని అంటున్నారు.
సాధారణంగా పాదయాత్రలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు చేపడితేనే ఫలితం ఉంటుంది. అలా కాకుండా పాదయాత్ర చేపడితే.. ప్రజల నుంచి పెద్దగా స్పందన ఉండదని పరిశీలకు చెబుతారు. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెద్దగా కనిపించడం లేదు కనుక మరో ఏడాది పాటు పాదయాత్ర ఊసెత్తకుండా ఉండటమే మేలని కేటీఆర్, బస్సు యాత్ర కూడా ఏడాది తరువాత చేపడితేనే ఫలితం ఉంటుందని కేసీఆర్ నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
KTRs padayatra postponed, Brs, Working President, Revantah Government, Anti Incumbency
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktrs-padayatra-postponed-39-225602.html
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.