పార్టీ, పాలనా బాధ్యతలు కేటీఆర్ కు.. కేసీఆర్ కార్యక్షేత్రం ఇక ఢిల్లీయే!?

Publish Date:Nov 13, 2022

Advertisement

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత తెలంగాణలో రాజకీయ కాక పెరిగింది. ఉప ఎన్నికలో విజయంతో తెరాసలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అదే సమయంలో గట్టి పోటీ ఇచ్చిన ఆనందం బీజేపీలో కనిపిస్తోంది. అయితే సిట్టింగ్ సీటు కోల్పోయిన కాంగ్రెస్ లో మాత్రం నిస్తేజం తాండ విస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మరింత ఎక్కువయ్యాయి. ఇక మోడీ పర్యటనతో బీజేపీలో దూకుడు పెరిగింది.

అవన్నీ పక్కన పెడితే.. తెరాస మాత్రం భవిష్యత్ కార్యాచరణతో ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ ను జాతీయ స్థాయలో బలేపేతం చేసేందుకు ఇక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినను కార్యక్షేత్రంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు.  ఢిల్లీలో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ ఆగమనాన్ని ఘనంగా చాటాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు, కార్యాచరణ ఇప్పటికే మొదలెట్టేశారంటున్నారు. ఆ సభ వేదికగానే బీఆర్ఎస్ జెండా, అజెండా ప్రకటించే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలోనే  కేసీఆర్  మంగళవారం (నవంబర్ 15)న పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యవర్గ సమావేశంతో భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ పార్టీకి దిశా నిర్దేశం చేయనున్నారు.   కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలంటే.. ముందుగా రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ బాధ్యతలను కేటీఆర్ కు పూర్తి స్థాయిలో అప్పగించాల్సి ఉంది. అందుకే నవంబర్ 15న జరగనున్న కార్యవర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఏడాదిలో జరగాల్సిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కూడా కేసీఆర్ పార్టీ నాయకులు, కేడర్ కు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే ముందస్తు ఎన్నికల ప్రతిపాదన కూడా సీఎం చేసే అవకాశం ఉందని తెరాస వర్గాలు చెబుతున్నాయి.  అన్నిటి కంటే ముఖ్యంగా   సీఎం బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగించే విషయమై ఈ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రకటేన చేసే అవకాశం ఉందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు కూడా కేసీఆర్ అనంతరం కేటీఆర్ ముఖ్యమంత్రి అని బహిరంగంగానే చెబుతున్నారు.  

దానిపై ఈ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించేందుకు నిర్ణయించుకున్న కేసీఆర్ ఇక రాష్ట్ర పాలనా వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశాలు తక్కువేననీ, అందుకే మొత్తం బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించి తన కార్యక్షేత్రాన్ని డిల్లీకి మార్చే నిర్ణయానికి వచ్చేసిన కేసీఆర్ కార్యవర్గ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.

వచ్చే నెలలో గుజరాత్ మొత్తంగా కేసీఆర్ వచ్చే ఆరు నెలలు తెలంగాణలోనే తీరిక లేని రాజకీయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారని అంటున్నారు. ఇప్పటికైతే ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని.. బీజేపీ కూడా ముందుకు రాకపోవచ్చని అంటున్నారు. మంగళవారం కేసీఆర్ నిర్వహించనున్న విస్తృత కార్యవర్గ సమావేశంలో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందులోనే… ముందస్తుకు వెళ్తారా లేదా కేటీఆర్‌ను సీఎంను చేస్తారా అన్న విషయాలపై చూచాయగా అయినా కేసీఆర్ క్లారిటీ ఇచ్చే చాన్స్ ఉందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అన్నిటికీ మించి వచ్చే నెలలో గుజరాత్ కు అసెంబ్లీ కి రెండు విడతలుగా  ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ లో బీఆర్ఎస్ పోటీపై ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేసిన కేసీఆర్... ఆ రాష్ట్రంలో కనీసం ఆరేడు స్థానాలలోనైనా విజయం సాధించి మోడీకి సవాల్ విసరాలన్న అభిప్రాయంతో ఉన్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్ గుజరాత్ ఇన్ చార్జిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్ శింగ్ వఘేలాను నియమించాలని ఆయన నిర్ణయించారనీ, శంకర్ సింగ్ వఘేలా కూడా ఒకటి రెండు రోజుల్లో తాను కేసీఆర్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అంటున్నారు. అలాగే తెలుగు వారి సంఖ్య అధికంగా ఉండే సూరప్ ప్రాంతంలో మొదటిగా బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు. అలాగే శంకర్ సింగ్ వఘేలా తోడ్పాటుతో గుజరాత్ లో మరి కొన్ని స్థానాలలో కూడా బీఆర్ఎస్ పాగా వేయగలదని ఆశిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంగళవారం (నవంబర్ 15)న జరగనున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమాశం ఎనలేని రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.