Publish Date:Jan 15, 2025
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం (జనవరి 16) ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు హైకోర్టులో, ఆ తరువాత బుధవారం (జనవరి 15) సుప్రీంకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రేపు ఈడీ విచారణకు హాజరు కానుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు బదిలీ చేశారని కేటీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి.ఆ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టులు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే కేటీఆర్ క్వాష్ పిటిషన్లను తిరస్కరించాయి. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురవ్వడంతో కేటీఆర్ ఈడీ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం (జనవరి 16) ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల తన నివాసం నుంచి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి బయలుదేరుతారు. ఉదయం గం.10.30లకు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. అయితే నంది నగర్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ప్రదర్శనగా కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వెళ్లే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఏసీబీ విచారణ సందర్భంగా ఈ సీన్ కనిపించడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ సారి ఈడీ విచారణకు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు.
విచారణ తరువాత కేటీఆర్ ను ఈడీ అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న అంచనాలు ఉన్నాయి. ఆ భయంతోనే కేటీఆర్ బలప్రదర్శనకు రెడీ అయ్యారని అంటున్నారు. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేటీఆర్ అరెస్టు అనివార్యమైతే ఏసీబీ అరెస్టు చేస్తే బెటరని భావిస్తున్నారు. ఈడీ అరెస్టు చేస్తే బెయిలు రావడం కష్టమనీ, అదే ఏసీబీ అరెస్టు చేస్తే బెయిలు ఒకింత తొందరగా వస్తుందనీ భావిస్తున్నారు. మొత్తం మీద ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమని కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణులు ఒక నిర్ధారణకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈడీ విచారణ తరువాత కేటీఆర్ అరెస్టు అవుతారన్న భయం బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసు ఓ లొట్టపీసు కేసు అంటూ పదేపదే చెబుతూ వచ్చిన కేటీఆర్ కు ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురయ్యింది. దీంతో కేటీఆర్ చెబుతున్నట్లు ఇది లొట్టపీసు కేసు కాదని సామాన్యులు కూడా భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-to-attend-ed-inquiry-25-191328.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.