ఏపీ వైఫల్యాలను ఎండగట్టడమే తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు వ్యూహమా?

Publish Date:Apr 3, 2023

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైఫల్యాలను చూపి తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు వ్యూహాలను పన్నుతోందా? జగన్ సర్కార్ వైఫల్యం వల్లే, కేంద్రాన్ని నిలదీయలేని బలహీనతే విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాబోతోందని, కేంద్రానికి జగన్ తొత్తులా మారడం వల్లే ఆ రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి వచ్చిందని ఎత్తి చూపి రాష్ట్రంలో పరపతి పెంచుకోవాలని తాపత్రేయపడుతోందా? అంటే పరిశీలకులు ఔననే విశ్లేషణలు చేస్తున్నారు.

అందుకే కేటీఆర్ తరచుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి లేమి గురించి మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఇటీవల దేశంలోనే అతి పెద్ద మునిసిపల్ అథారిటీగా అమరావతి అభివృద్ధి చెంది ఉండేదనీ.. కానీ రాష్ట్రంలో 2019లో ప్రభుత్వం మారిన తరవాత అమరాతి అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. అదే సమయంలో తెలంగాణలో రూరల్ రింగ్ రోడ్లను సైతం అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పుుకొచ్చారు. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కూడా తెలంగాణ మంత్రి కేటీఆర్ గళమెత్తారు. ఆంధ్రుల హక్కు ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో గట్టి పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ ఏపీ శాఖకు పిలుపునిచ్చారు.  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించాల్సిన ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆ పని చేయడం లేదని అర్ధం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

వైసీపీ ఎంపీలు విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడటం లేదన్నారు ఆయన మాటలను ఎవరైనా సరే ఏపీలో సర్కార్ కేంద్రానికి అడుగులకు మడుగులొత్తుతోందనీ, ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కేంద్రాన్ని గట్టిగా ఎదుర్కొటోందనీ, కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలనూ, తెలుగు రాష్ట్రాలకు మోడీ సర్కార్ చేసిన అన్యాయాన్నీ గట్టిగా ప్రశ్నిస్తోందనీ చెప్పుకుంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు తెలంగాణలో పార్టీకి ప్రజాబలం కూడగట్టడంతో పాటు, విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలమెత్తడం ద్వారా బీఆర్ఎస్ ఏపీలో కూడా గట్టి పునాది ఏర్పరుచుకునేలా కేటీఆర్ తీరు ఉంది.

ఇప్పటి వరకూ ఎప్పుడో అడపాదడపా తప్ప ఏపీలోని జగన్ సర్కార్ తో సఖ్యత కోసమే ప్రయత్నించిన బీఆర్ఎస్ ఇటీవలి కాలంలో  జగన్ వైఫల్యాలే తెలంగాణలో తమకు ప్రయోజనం చేకూరుస్తాయన్న భావనకు వచ్చారు. అందుకే సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఏపీలోని జగన్ వైఫల్యాలను తెలంగాణ గడ్డ వేదికగా గట్టిగా ఎండగడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ జగన్ వైఫల్యాలను ఎత్తి చూపడమే కాకుండా, తెలంగాణలో ప్రగతిని ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వ ఘనతను చాటుతున్నారు.  

By
en-us Political News

  
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.