కేటీఆర్ కు చెలగాటం కవితకు సంకటం

Publish Date:Oct 16, 2022

Advertisement

ఉరుము ఉరిమి మంగలం మీద పడడం  అంటే ఇదే నేమో. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతోంది. ముఖ్యంగా, మునుగోడు ఉప ఎన్నికను తమ రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించే కీలక ఎన్నికగా భావిస్తున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కల్వకుట్ల తారక రామా రావు, దటీజ్ కేటీఅర్  ప్రధానంగా  బీజేపీయే టార్గెట్ గా కత్తులు దూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటి రెడ్డి వెంకట రెడ్డి వరకు ఎవరినీ వదిలి పెట్టకుండా, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 

నిజమే. సహజమే ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులపై విమర్శలు చేయడం  సహజమే. కానీ, కేటీఆర్  స్థాయిని మరిఛి చేస్తున్న విమర్శలు, శృతి మించుతున్నాయి, చిక్కులు తెచ్చిపెడుతున్నాయని, అంటున్నారు. ఒక విధంగా కేటీఆర్ విమర్శలు ఇటు పార్టీని, పార్టీ నాయకులను,మరీ ముఖ్యంగా కల్వకుట్ల కుటుంబాన్నిచిక్కుల్లోకి నేట్టేస్తోందని అంటున్నారు. ఓ వంక, సోదరి, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని వార్తలొస్తున్నాయి. అదే సమయంలో కేటీఆర్ చేస్తున్న విమర్శలు బీజేపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని తెరాస నాయకులే గుసగుసలు పోతున్నారు. ఇది పార్టీకు, ఫ్యామిలీకి ఇద్దరికీ మంచిది కాదని, అంటున్నారు. 

రాజకీయాలలో రాణించాలంటే, ఎక్కడ ఎక్కాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసుండాలి, నిజానికి కేసీఆర్ విజయ రహస్యం అదే. ఉద్యమ సమయం నుంచి  కూడా కేసీఆర్, బ్లో హాట్ అండ్ బ్లో కోల్డ్ పాలసీనే ఫాల్లో అవుతూ వచ్చారు. గిట్టని వాళ్ళు కొందరు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, అంటారు అయినా కేసీఆర్ అదే పాలసీనే ఫాలో అవుతున్నారని అంటారు. ఇప్పుడు కూడా  కేసేఆర్ కుమార్తె కవితను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లి, అక్కడే  ఉన్నారు. ఆయన ఢిల్లీ యాత్రకు, కవిత కేసుకు సంబంధం వుందో లేదో, కానీ, ఢిల్లీ లిక్కర్ కేసులో బోయినపల్లి అభిషేక్‌’ను సీబీఐ అదుపులోకి తీసుకున్నవెంటనే కవిత, సంతోష్ను వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు.

నిజానికి, ‘నువ్వు గోకినా గోకకున్నా, నిన్ను నేను గోకుతూనే ఉంటాను’ అంటూ ప్రధాని మోడీని పేరు పెట్టి మరీ హెచ్చరించిన కేసేఆర్, ఇంచు మించుగా గడచిన వారం రోజులుగా ఢిల్లీలో ఉండి కూడా మోడీని ఒక్క సారి కూడా  గోకలేదు. ఒక్క మాట కూడా అనలేదు. అలాగని ఆయన కవిత లిక్కర్ కేసు విషయంలో భయపడుతున్నారని అనలేము అలాగే  అనకుండానూ ఉండలేమని అంటున్నారు. సమస్యలు చుట్టు ముట్టినప్పుడు మౌనాన్ని ఆశ్రయించడం కేసీఆర్ అడాప్ట్ చేసుకున్న విధానమని  ఆయన ప్రస్తుత మౌనం కూడా అందుకు సంకేతం కావచ్చని అంటున్నారు.  

అయితే కేసీఆర్ గోకుడు ఆపేసినా, అనూహ్యంగా మునుగోడు బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నకేటీఆర్ మాత్రం గోకుడు ఆపలేదు. మోడీ.. బోడీ.. ఈడీ.. దేనికైనానా రెడీ అంటూ ప్రధాని మోడీని దూషించిన కేటీఆర్, కోమటి రెడ్డి బ్రదర్స్గా పాపులర్ అయిన మునుగోడు బీజేపీ అభ్యర్ధి, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డిని కలిపి వారు ‘కోమ‌టిరెడ్డి బ్రదర్స్ కాదు కోవర్ట్ బ్ర‌ద‌ర్స్’ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అటు నుంచి కౌంటర్ గట్టిగానే వచ్చింది. కల్వకుట్ల కుటుంబం కమీషన్ల కుటుంబం అంటూ కోమటి రెడ్డి సోదరులు ఇద్దరూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అంటే కాకుండా బీజేపీ నాయకులు మొత్తంగా కల్వకుట్ల ఫ్యామిలీ టార్గెట్’గా పాత పురాణాలు అన్నీ బయట పెడుతున్నారు.

అందులో భాగంగానే, రాజగోపాల రెడ్డి, తాజాగా, “ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని 600 మద్యం దుకాణాల్లో వాటా ఉంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆమెతోపాటు కేసీఆర్‌ హస్తం కూడా ఉంది. కవిత అవినీతిపై ఇప్పటికే సీబీఐ విచారణ జరుగుతోంది. వచ్చే బతుకమ్మ వేడుకలను ఆమె తీహార్‌ జైల్లోనే జరుపుకోవాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

మరోవంక సీబీఐ, ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణను వేగం పెంచింది. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రిక్’గా విచారణ సాగిస్తోంది. సీబీఐ అదుపులో ఉన్న బోయినపల్లి అభిషేక్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆయన గతంలో కవితకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో, ఏ క్షణానికి ఏమి జరుగుతుందో, అనే అనుమానం తెరాస నాయకులను,వెంటాడుతోంది. అయితే, కేటీఆర్ మాత్రం తగ్గేదేలే... అంటూ తన దారిలో తాను బీజేపీ నాయకులను తమదైన ధోరణిలో విమర్శిస్తూనే ఉన్నారు. అందుకే, కేటీఆర్ ధోరణి, పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్న విధంగా మారిందని అంటున్నారు.

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.