శ్రీనువైట్ల కి షాకిచ్చిన కోన వెంకట్
Publish Date:Apr 10, 2013
Advertisement
బాద్ షా సినిమా తరువాత దర్శకుడు శ్రీను వైట్ల, రచయిత కోన వెంకట్ల మద్య బేధాభిప్రాయాలు తలెత్తాయి. బాద్ షా సినిమాకు తను, గోపీ మోహన్ కలిసి కధ అందించినప్పటికీ, సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో కనీసం తన పేరు కూడా వేయలేదని కోన వెంకట్ ఆగ్రహం చెందడంతో వారి మద్య బేధాభిప్రాయాలు మొదలయ్యాయి. అయితే, ప్రింటింగ్ విభాగంలో జరిగిన చిన్నపొరపాటు వలననే పేరు అచ్చవలేదని, తరువాత వచ్చే అన్ని పోస్టర్స్ మరియు ట్రయలర్స్ లో కోన వెంకట్ పేరు తప్పకఉంటుందని నిర్మాత బండ్ల గణేష్ హామీ ఈయడంతో గొడవ సద్దుమనిగింది. కానీ, సినిమా విడుదల అయిన తరువాత సినిమా అంత గొప్పగా హిట్టవడానికి కారణం శ్రీను వైట్ల దర్శకత్వ ప్రతిభ, అయన స్వయంగా వ్రాసుకొన్న సింగల్ లయిన్ డైలాగులే కారణమని మీడియాలో బాగా ప్రచారం జరగడంతో, కధ మళ్ళీ మొదటికి వచ్చింది. సినిమా విజయంలో తన పాత్ర ఏమి లేదా? అని కోన వెంకట్లో ఆవేశం కలగడం ఆ ఊపులో ట్వీటర్లో కొన్ని పంచు డైలాగులు పేల్చడం జరిగింది. “కనీసం స్క్రీన్ ప్లే అనే పదానికి స్పెల్లింగు కూడా వ్రాయడం చేత కాని దర్శకులు చాల మందే ఉన్నారని” ఆయన చురకలు వేసారు. అవి ఎవరిని ఉద్దేశించి వేసినవో అందరికీ తెలుసు. ఆ తరువాత బాద్ షా హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కి ఆహ్వానం వచ్చినా కోన వెంకట్ వెళ్ళలేదు కానీ, ట్వీటర్ లో మరి కొన్నిడైలాగులు వేసారు. “మమ్మల్ని కూడా సినిమా యూనిట్ లో సభ్యులుగా ఇంకా గుర్తుంచు కొన్నందుకు చాల థాంక్స్,” అని ఆ తరువాత “మమ్మల్ని వాడుకోండి, ఉపయోగించుకోండి, కానీ అవసరం తీరిన తరువాత విసిరి పారేయకండి” అనే డైలాగుతో, దాదాపు 10సం.లు కలిసి పనిచేసి, 8 విజయవంతమయిన సినిమాలకు కధలందించిన వారి స్నేహసంబంధాలు పుట్టుకున తెగిపోయాయి. అందుకు శ్రీను వైట్ల కూడా స్పందించక పోవడం విశేషం. కానీ ఆయనకు బదులు వారిరువురితో కలిసి పనిచేసిన మరో రచయిత గోపీ మోహన్ “నేను గత 10 ఏళ్లుగా శ్రీను వైట్లతో కలిసి పనిచేస్తున్నాను. ఆయన రచయితలకు పూర్తి స్వేచ్చానిస్తారు. మా ఇరువురి మద్య చక్కటి అవగాహన, అనుబంధం ఉంది” అని ట్వీట్ చేయడంతో వారి ముగ్గురు కధ మంచి క్లయిమాక్స్ తో ముగిసింది. అప్పుడే, కోన వెంకట్ తానేమిటో త్వరలో నిరూపించుకోనున్నాని, పెన్ను పట్టినవాడు మెగా ఫోన్ పట్టలేదని భావించవద్దంటూ అనడమే కాకుండా, త్వరలో తన మాటలు నిజం చేసిచూపేందుకు సిద్ధం అయ్యాడు. పవన్ కళ్యాణ్ నటించనున్న గబ్బర్ సింగ్-2 సినిమాకి ఆయన కధ మరియు దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ స్వయంగా తన స్వంత బ్యానర్లో నిర్మిస్తారని మరో సమాచారం. ఒక కధా రచయిత మెగాఫోను చేపడితే అది ఎంత ఘాటుగా ఉంటుందో ఇప్పటికే కొరటాల శివ తన మిర్చీ సినిమాతో నిరూపించాడు. మరి సుదీర్గ అనుభవం ఉన్న కోన వెంకట్ దర్శకత్వం వహిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే. పెన్ను, కాగితాలు వేసుకొని గదిలో ఓ మూల కూర్చొని కధలు వ్రాసుకొనే వాడిని రెచ్చ గోడితే మరో కొత్త దర్శకుడుపుడితే, అది పోటీ పెంచుతుందే తప్ప తగ్గించదు కదా! దాని వల్ల ఎవరికి నష్టం అని కోన వెంకట్ మరో చిన్న డైలాగు పేల్చినట్లు సమాచారం. ఆయన చెప్పింది నిజమే కదా!
http://www.teluguone.com/news/content/kona-venkat-32-22378.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





