కొడాలి నాని ఈజ్ బ్యాక్.. కానీ ఆ పాత ఫైర్ ఏదీ!

Publish Date:May 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  కొడాలి నాని మళ్లీ వార్తల్లో నిలిచారు. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు   క్రియాశీల రాజకీయాలకు,  దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల ఆయన మళ్లీ ప్రజల ముందుకు రావడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన తాను సుదీర్ఘ కాలం రాజకీయాలకు దూరంగా ఉండటానికి కారణం వెల్లడించారు.  

తన రాజకీయ అజ్ఞాతవాసానికి   తనకు జరిగిన బైపాస్ సర్జరీయే కారణమన్నారు. సర్జరీ తరువాత  కనీసం 6 నెలలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడం వల్లనే తాను గుడివాడకు, రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు.   ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే తాను బయటకు రాలేకపోయానని, రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని  కొడాలి నాని చెప్పారు.   వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం (మే 27) మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ సందర్భంగా ఆయన  శైలి గతానికి పూర్తి భిన్నంగా కనిపించింది. సాధారణంగా కొడాలి నాని,  చంద్రబాబు,  ఆయన కుటుంబ సభ్యుల పట్ల తీవ్రమైన ద్వేషంతో  మాట్లాడతారు. చంద్రబాబు తనకు వ్యక్తిగత శత్రువు అన్నట్లుగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. చంద్రబాబుపై విమర్శలకు ఆయన అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తుంటారు. కానీ బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అటువంటిదేదీ కనిపించలేదు. ఎవరో ఒత్తిడి చేయడం వల్ల మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా అనిపించేలా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంది. 

ఏదో నామ్ కే వాస్తే విమర్శలు చేసినట్లుగా అనిపించింది తప్ప.. గతంలో ఆయన మాటల్లో ఉన్న కసి, ఆవేశం ఇసుమంతైనా కనిపించలేదు.  జగన్ లేదా వైసీపీ అగ్రనేతల ఒత్తిడి కారణంగానే ఆయన మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేసినట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.