ఇలా ఏఐజీ నుంచి డిశ్చార్జ్.. అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి కొడాలి నాని

Publish Date:Mar 31, 2025

Advertisement

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ కాగానే అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైలోని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. ఈ నెల 26న కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్న నానిని ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందనీ ఏఐసీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొడాలి నానికి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు వాల్వ్ లు మూసుకుపోయాయనీ, స్టంట్ అమర్చాలి  లేదా బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో కొడాలి నాని కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కొసం ముంబైలోని ఏషియన్ హర్ట్ ఇనిస్టిట్యూట్ కు తరలించాలని నిర్ణయించు కున్నారు. దీంతో వారి విజ్ణప్తి పేరకు ఏఐజీ ఆస్పత్రి నుంచి కొడాలి నానిని డిశ్చార్జ్ చేశారు.  ఆ వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలించారు. ఈ ఎయిర్ అంబులెన్స్ లో కొడాలి నానితో పాలటు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు,  అలాగే ఏఐజీ ఆస్పత్రికి సంబంధించిన ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ కీలక నాయకుడు నాగేంద్ర బాబు ఎంట్రీ ఎప్పుడన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా నడుస్తోంది. కొణిదెల నాగబాబు బుధవారం (ఏప్రిల్ 2) ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
కర్నాటక రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలను నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లోగా రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని కర్నాటక హైకోర్టు తీర్పు వెలువరించింది.
త కొన్ని రోజులుగా భానుడి భగభుగలతో, అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్ నగరవాసులకు వరుణుడు ఒకింత ఉపశమనాన్ని ఇచ్చాడు. గురువారం మధ్యాహ్నం వరకూ చండ్ర నిప్పులు చెరుగుతున్నట్లుగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం తరువాత హఠాత్తుగా చల్లబడింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ను స్వతంత్ర సం్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటి వరకూ ఏపీ ఫైబర్ నెట్ లో భాగంగా ఉన్న డ్రోన్ కార్పొరేషన్ ను ఇక నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ గా స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
నటుడు  పోసాని కృష్ణ మురళి షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పోసానికి బెయిల్ ఇచ్చేముందు కోర్టు ప్రతీ  సోమవారం,  గురువారం  మంగళగిరి సిఐడి కార్యాలయానికి రావాలి. రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని   బెయిల్ పై విడుదలైన తర్వాత మంగళగిరి  సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు.
మాట తప్పను.. మడమ తిప్పను అని పదేపదే చెప్పుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా సాగింది. ఇచ్చిన ఏ మాటనూ, చేసిన ఏ వాగ్దానాన్నీ పూర్తిగా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఇచ్చిన మాటకు కట్టబడటం అన్నది ఆయన డిక్షనరీలోనే లేదనిపించేలా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. విపక్షంలో ఉండగా అమరావతి రాజధానికి జై అన్న జగన్ అధికార పగ్గాలు అందుకోగానే మూడు రాజధానులంటూ మూడుముక్కలాటకు తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. అమ్మ ఒడి, పింఛన్లు ఇలా ఒకటనేమిటి.. తన పాదయాత్ర సందర్భంగా గల్లీ కో వాగ్దానం చొప్పున చేసిన జగన్ వాటిని నెరవేర్చాలన్న విషయాన్నే పూర్తిగా మరిచారు. అధికారం అంటే కక్ష సాధింపు, దోచుకో, దాచుకో అన్నట్లుగా ఆయన పాలన సాగింది.
తెలంగాణలో బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న సెలబ్రిటీలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కు పాదం మోపిన సంగతి తెలిసిందే వివిధ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు కావడంతో ఆరోపణలు  ఎదుర్కొంటున్న సెలబ్రిటీలు పోలీసుల విచారణకు డుమ్మా కొడుతున్నారు
ఏపీలో ఎన్నికలకు ముందు మీసాలు మెలేసి, తొడలు కొట్టిన మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ఫలితాల తర్వాత పత్తా లేకుండా పోయారు. చంద్రబాబుతో పాటు పవన్‌పై విరుచుకుపడిన ఆ ఫైర్‌బ్రాండ్‌ నేత సడన్‌గా సైలెంట్ అయ్యారు. ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి పోవడం నెల్లూరులో హాట్ టాపిక్‌గా మారింది. పదేళ్లు ఎమ్మెల్యేగా, దాదాపు మూడేళ్లు మంత్రిగా పనిచేసిన ఆ సారు ఇప్పుడు ఇంతకాలం తనకు అండగా ఉన్న అనుచరులకు కూడా అందుబాటులో లేరంట.
మూసీ సుందరీకరణ మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకూ ఆ పరిసరాలలో నిర్మాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు మూసీ నదికి 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిపాదించి, ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై బీఏసీలో ఎనిమిది గంటల చర్చకు అంగీకారం కుదిరినప్పటికీ, అధికార, విపక్ష కూటముల మధ్య తీవ్ర వాగ్వివాదాలలో చర్చ సుదీర్ఘంగా సాగింది. దాదాపు 12 గంటలకు పైగా చర్చ జరిగింది.
ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల ధాయ్ ల్యాండ్ పర్యటన కోసం గురువారం (ఏప్రిల్ 3) బయలు దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ థాయ్ ప్రధాని షఓటోంగ్ టార్స్ షినవ వ్రతాలతో భేటీ అవుతారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా పదవీ కాలం ఎప్పుడో ముగిసి పోయింది. లోక్ సభ ఎన్నికలకు ముందే ఆయన సెకండ్ టర్మ్ కూడా పూర్తయింది. అయితే లోక్ సభ ఎన్నికలతో పాటుగా అనేక ఇతర కారణాల వలన, దేశ వ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు వాయిదా పడడంతో నూతన జాతీయ అధ్యక్షుని ఎన్నిక కూడా లేటవుతూ వస్తోంది.
ప్రధాని నరేంద్రమోడీ తన పదవిని త్యాగం చేస్తారా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.