Publish Date:Apr 17, 2025
రేవంత్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉండాలి.. ఈ దిక్కు మాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ మాకు లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని అన్నారు. హెచ్‌సీయూ భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు.
Publish Date:Apr 17, 2025
మద్యం కుంభకోణం దర్యాప్తులో స్పీడ్ పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తాజాగా ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సిట్ నోటీసుల మేరకు మిథున్ రెడ్డి శుక్రవారం (ఏప్రిల్ 18) విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Publish Date:Apr 17, 2025
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. మోడీ పర్యటనకు, పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మే2వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు మోడీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పీఎం పర్యటనపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. పర్యటన ఏర్పాట్లపై అధికారలతో సమీక్ష నిర్వహించారు.
Publish Date:Apr 17, 2025
తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో గోవులు మరణించాయంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి చేసిన ఆరోపణలను ఖండించింది. అసత్య ప్రచారమని స్పష్టం చేస్తూనే, వాస్తవానికి కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు జరిగాయని ప్రత్యారోపణ చేసింది.
Publish Date:Apr 17, 2025
హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు బిగ్ షాక్. మెట్రో రైలు చార్జీలు దగ్గరదగ్గర 50 శాతం పెరగనున్నాయి. అతి త్వరలోనే మోట్రో రైలు చార్జీల పెంపు ఉంటుందని మెట్రో వర్గాల ద్వారా తెలుస్తోంది.
Publish Date:Apr 17, 2025
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరన్నది రెండు మూడు రోజుల్లో తేలిపోనున్నది. అదే విధంగా ఆరు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారం కూడా నేడో రేపో కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది.
Publish Date:Apr 17, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (ఏప్రిల్ 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 13 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
Publish Date:Apr 16, 2025
వైసీపీకి రిజైన్ చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆ విరామానికి బ్రేక్ వేసి పొలిటికల్‌గా రీఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారంట. విజయసాయిరెడ్డిని బీజేపీలోకి తీసుకుని, ఆయన ఖాళీ చేసిన రాజ్యసభ పదవిని ఆయనకే తిరిగి కట్టబెట్టాలని బీజేపీ పెద్దలు ఫిక్స్ అయ్యారంటున్నారు. ఆయన్ని తిరిగి రాజ్యసభకు పంపి వైసీపీలోని ముఖ్య నేతలను బీజేపీలోకి తెచ్చుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.
Publish Date:Apr 16, 2025
తెలంగాణలో ఏమి జరుగుతోంది? రాష్ట్ర రాజకీయాల్లో ఇంత గందరగోళం ఏమిటి? ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేనికి సంకేతం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలను ,గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం కూలిపోతుందని, కూల్చేందుకు సుపారీ ఆఫర్లు వస్తున్నాయని జరుగతున్న ప్రచారం వెనక ఉన్న రాజకీయం ఏమిటి?
Publish Date:Apr 16, 2025
తెలంగాణలో ఈ పథకం ఒక గేమ్ చేంజర్ గా మిగులుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో యువ వికాసం పథకం అమలుపై బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయిని వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయిని ఆయన తెలిపారు
Publish Date:Apr 16, 2025
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నాది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు...
Publish Date:Apr 16, 2025
ఇటీవల మోదీ సర్కారు ఆమోదించిన వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు ఇవాళ(బుధవారం) విచారణ ప్రారంభించింది. వక్ఫ్ సవరణ చట్టంపై కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలతో పాటు పలు ప్రశ్నలకు 2 వారాల్లోనే సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.
Publish Date:Apr 16, 2025
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా వచ్చే నెల 13న పదవీ విరమణ చేయనున్న సంగతి విదితమే.