సోమేష్ కుమార్ కు బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలు?.. కేసీఆర్ వ్యూహమేంటి?

Publish Date:Feb 23, 2023

Advertisement

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వంలో కాదు, బీఆర్ఎస్ లో కీలక పదవి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆయనను బీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో నిలబెట్టే దిశగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. సోమేష్ కుమార్ స్వరాష్ట్రం బీహార్ లో ఆయనకు బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించి.. ఆ రాష్ట్రం నుంచి లోక్ సభ ఎన్నికలలో పోటీకి నిలపాలన్న యోచన చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి.  

తొలుత ఆయన ఏపీలో రిపోర్టు చేసి.. ఆ తరువాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం వరకూ అన్నీ కేసీఆర్ చెప్పిన విధంగానే.. ఆయన కనుసన్నలలోనే జరిగాయని అంటున్నారు. ముందుగా ఆయనను రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారటీ) చైర్మన్ గా నియమిస్తారన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే.. కోర్టుతీర్పు కారణంగా ఆయన తెలంగాణలో రిలీవ్ అయ్యి.. ఏపీలో రిపోర్టు చేసే సమయానికి ఆయన రెరా బాధ్యతలు చూస్తున్నారు. ఆయన వెళ్లినప్పటి నుంచీ కూడా ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారం జరిగింది. ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారమూ విస్తృతంగా సాగింది.

అయితే ఆయన మేనేజ్ మెంట్ స్కిల్స్, ఎడ్మినిస్ట్రేటివ్ ఎక్స్ పీరియన్స్ ను పార్టీ కి ఉపయోగించుకోవాలని కేసీఆర్ ఫిక్సయ్యారని అంటున్నారు. బీఆర్ఎస్ విస్తరణ విషయంలో కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి.  జాతీయ స్థాయిలో మద్దతు కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలూ పెద్దగా ఫలిస్తున్న సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి సొంతగా బీజేపీయేతర శక్తుల ఐక్యతకు తన వంతుగా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా కేసీఆర్ ను దూరం పెట్టడంతో... బీహార్ లో తనకు మద్దతుగా కార్యక్రమాలు చేపట్టడానికీ, పార్టీ కార్యకలాపాల వేగం పెంచడానికీ, ఆ రాష్ట్రంలో ఇప్పటికే నితీష్ కు వ్యతిరేకంగా ఒంటరిగా తన పని తాను చేసుకుపోతున్న ప్రశాంత్ కిషోర్ తో కలిసి బీఆర్ఎస్ బలోపేతం కోసం పని చేయడానికి సోమేష్ సేవలు వినియోగించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని అంటున్నారు.

సివిల్ సర్వెంట్లు తమ సర్వీసుల నుంచి అర్ధంతరంగా  రాజీనామా చేసి రాజకీయాలలోకి రావడం కొత్తేమీ కాదు. అందులో ఎంత వరకూ సక్సెస్ అయ్యారు అన్నది పక్కన పెడితే.. సివిల్ సర్వెంట్ల రాజకీయ ప్రవేశానికి ఆరంభంలో మాత్రం అన్ని వర్గాల నుంచీ ఆమోదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ ను రాజకీయాలలోకి తీసుకురావడానికి కేసీఆర్ ఆసక్తి చూపడం మాత్రం తెలంగాణ సీఎస్ గా ఆయన పని చేసిన తీరు నచ్చడమే నని అంటారు. మరీ ముఖ్యంగా కేసీఆర్ మానస పుత్రికగా అంతా చెప్పే ధరణి రూపకల్పన వెనుక ఉన్నదంతా సోమేష్ కుమారేనని పార్టీ శ్రేణులే కాదు, పరిశీలకులు కూడా పలు సందర్భాలలో చెప్పారు. అంతే కాదు పలు సందర్బాలలో సీఎం కేసీఆర్ సోమేష్ కుమార్ పై బహిరంగ వేదికలపై సైతం ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ కు కేసీఆర్ ఏ నామినేటెడ్ పదవో, సలహాదారు పోస్టో కాకుండా బీఆర్ఎస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశమే మెండుగా ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. 

By
en-us Political News

  
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.