రసకందాయంలో కర్నాటకం.. డీకే వర్గం తిరుగుబాటు?

Publish Date:Feb 26, 2026

Advertisement

కర్నాటక రాజకీయం రసకందాయంలో పడిందా? డీకే వర్గం తిరుగుబాటుకు రెడీ అయ్యిందా? రాష్ట్రంలో అధికార మార్పిడి అంశం తుది అంకానికి చేరిందా? అన్న ప్రశ్నలకు జరుగుతున్న పరిణామాలను ఉటంకిస్తూ పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో తిరుగుబావుటా ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  అధిష్ఠానం ఇచ్చిన మాట మేరకు సిద్ధరామయ్య స్థానంలో తనను సీఎంను చేయాలని గత కొంత కాలంగా గట్టిగా పట్టుబడుతున్నారు.

ఈ విషయంలో అధిష్ఠానం చేస్తున్న తాత్సారం కారణంగా ఆయన వర్గీయులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తాజాగా డీకే వర్గానికి చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ హోటల్ లో గురువారం (ఫిబ్రవరి 27) సమావేశం కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, కర్నాటక కాంగ్రెస్ లో ప్రకంపనలకు కారణమైంది.  ఓ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుక అని చెబుతున్నప్పటికీ..  అధికార మార్పిడి విషయంలో అధిష్ఠానంపై తిరుగుబావుటా సంకేతమనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండున్నరేళ్ల తర్వాత పదవిని డిప్యూటీ సీఎంకు అప్పగిస్తారనే ఒప్పందం ఉందని డీకే శివకుమార్ వర్గం బలంగా చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  సిద్ధరామయ్య  తన బలాన్ని నిరూపించుకునేందుకు సమాయత్తమయ్యారన్న సంకేతాన్ని ఈ సమావేశం ద్వారా అధిష్ఠానానికి బలంగా ఇచ్చారని అంటున్నారు. కాగా ఈ సమావేశానికి సిద్ధరామయ్య కేబినెట్ లోని ఇద్దరు కీలక మంత్రులు కూడా హాజరు కావడంతో సిద్దరామయ్య, డీకే మధ్య ఆధిపత్య పోరు పీక్స్ కు చేరిందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  

అదలా ఉంటే.. డీకే శివకుమార్ వర్గం బెంగళూరు హోటల్ లో సమావేశమైన సమయంలోనే కాకతాళీయమో, యాధృచ్ఛికమో చెప్పలేం కానీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మద్దతు పలుకుతున్న దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలో ఉన్నారు. వీరంతా ఆదివారం (మార్చి1)న స్వదేశానికి తిరిగి రానున్నారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం తన సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఆధిపత్యపోరుపై ఎప్పట్లగానే స్పందించారు.  రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై తుది నిర్ణయం అధిష్ఠానానిదేనన్నారు.  ఈ పరిణామాల నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తరువాత రాష్ట్ర రాజకీయాలలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.  

By
en-us Political News

  
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.