ఒకే ఒక్కడు కేజ్రీవాల్! బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు ఆప్ వికర్ష్ ఆపరేషన్

Publish Date:Aug 31, 2022

Advertisement

దేశంలో మోడీ,షా ద్వయం ఎత్తులను చిత్తు చేస్తూ, కేంద్రంలోని మోడీ సర్కార్ ను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ఒకే ఒక్క బీజేపీయేతర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేల్చేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేజ్రీవాల్ తానే స్వయంగా ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం అంటూ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై కేసు నమోదు చేసిన తరువాత కూడా ఆప్ ధీమాగా ఉంది. అక్రమ కేసు అంటు నిలబడింది. సోదాలు, తనిఖీలను పట్టించుకోలేదు. దీంతో ఢిల్లీలో ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరతీసింది. ఆప్ ఎమ్మెల్యేలు 40 మందికి ఒక్కొక్కరికీ పాతిక కోట్ల రూపాయలు ఇవ్వజూపిందని కేజ్రీవాల్ అసెంబ్లీ సాక్షిగా ఆరోపించి.. కమలనాథుల ప్రలోభాలకు తమ ఎమ్మెల్యేలు ఎవరూ లొంగలేదని సగర్వంగా ప్రకటించి.. ప్రభుత్వం పట్ల ఆప్ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని మరోసారి నిర్ద్వంద్వంగా నిరూపించడానికే నంటూ తన ప్రభుత్వంపై తానే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టుకుని మోడీకి సవాల్ విసిరారు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా కేజ్రీవాల్ తన ప్రసంగంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ప్రజాస్వామ్య విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. ఫెడరల్ స్ఫూర్తిని కాలరాసి.. ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్రాలలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వాలను పడగొట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను ఎండగట్టారు. వాస్తవానికి అసెంబ్లీలో బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైందనీ, కానీ కేజ్రీవాలే స్వియంగా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టి బీజేపీకి కేజ్రీవాల్ షాక్ ఇచ్చారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఏ సీఎం కూడా స్వయంగా తన ప్రభుత్వంపై తానే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టరు. కానీ కేజ్రీవాల్ రూటే సెపరేటు. తన ప్రభుత్వంపై, తన ఎమ్మెల్యేలపై అచంచల విశ్వాసం, తనకున్న ప్రజాదరణపై నమ్మకం ఉన్నందునే కేజ్రీవాల్ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. సాధారణంగా విశ్వాస తీర్మానంపై సభ్యులందరూ మాట్లాడిన తరువాత ముఖ్యమంత్రి సమాధానం చెబుతారు.

ఈ విషయంలో కూడా కేజ్రీవాల్ బీజేపీకి, కేంద్రానికి ఝలక్ ఇచ్చారు.  ముందుగా తానే ప్రసంగించడం ద్వారా బీజేపీకి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి కల్పించారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాలలోని బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రంలోని మోడీ సర్కార్ కూలదోసిన తీరును కళ్లకు కట్టినట్లు వివంరించారు.  ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగం తరువాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ముంబైలో స్పందించిన తీరే కేజ్రీవాల్ ప్రసంగం ఎంత సూటిగా, సుత్తిలేకుండా ఉందో అవగతమౌతుంది. కేజ్రీవాల్ మాదిరిగా తాను కమల నాథుల కుట్రలను ముందుగా పసిగట్ట లేకపోయానని అంగీకరించారు.  దేశమంతటా కాషాయి జెండా ఎగరాలన్న ఆకాంక్షతో కమలనాథులు సాగిస్తున్న ఆపరేషన్‌ ఆకర్ష్‌ పూర్వపు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిం చిన పార్టీ ఫిరాయింపుల విధానం కన్నా దుర్మార్గమైనదని  కేజ్రీవాల్ విమర్శించారు.    

By
en-us Political News

  
తూమాటి మాధవరావు శాసనమండలి కార్యదర్శికి  తన నామినేషన్ పత్రాలను   సమర్పించారు. రాష్ట్ర శాసనమండలిలో  వైసీపీకి సంఖ్యా బలం స్థానం ఉండటంతో..  డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక కావడం లాంఛనమే. 
కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు. 
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై  జోగి రాజీవ్ భార్య  మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన  ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.    
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.