అవినీతిని అంతం చేస్తానంటూ.. అవినీతి ఆరోపణలతోనే పనతం.. కేజ్రీవాల్ ప్రస్థానం

Publish Date:Feb 9, 2025

Advertisement

ఢిల్లీలో ఊపిరి పోసుకున్న అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)   జాతీయ పార్టీగా ఎదిగి పంజాబ్ లో అధికారం కైవసం చేసుకుని 12ఏళ్లు ఢిల్లీని పరిపాలించి అవమానకర పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్, బీజేపీ లను వ్యతిరేకించిన పార్టీగా, అవినీతిని దనుమాడుతామంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆప్  ఆ తరువాత రాజకీయ పరమపద సోపానపటంలో అవినీతి అనే పెద్ద పాము చేతిని చిక్కి పతనమైంది. అవినీతిపై పోరాటం అన్న నినాదాన్ని పక్కన పెట్టి స్వయంగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అలాగే రాజకీయ చదరంగం కూడా ఆడి ఆ ఆటలో బీజేపీ ఎత్తులకు చిత్తైపోయింది. బీజేపీ వ్యతిరేక కూటమి అయిన ఇండియా కూటమిలో భాగస్వామి అయి కూడా తాజా ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగి.. చేజేతులా ఇండియా కూటమి ఓట్లు చీలి తన ఓటమికి కారణమయ్యేలా చేసుకుంది.  

దశాబ్దానికి పైగా ఢిల్లీలో అధికారంలో ఉండి కూడా   కనీసం సౌకర్యాల కల్పనలో విఫలమైంది. ఉచితాలనే నమ్ముకుని బొక్కబోర్లా పడింది.  ఆప్  2012లో పుట్టి,2013 ఢిల్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చింది. 2015లో జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాలు కైవసం అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల తరువాత  .2020 లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా  కూడా62 స్థానాలు సాధించి సత్తా చాటుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే మళ్లీ ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని పరాజయం పాలైంది. 26 ఏళ్లుగా బీజేపీకి అందని ద్రాక్షలా నిలిచిన హస్తిన పీఠాన్ని పువ్వుల్లో పెట్టి మరీ ఆ పార్టీకి  ఈ సారి బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకుని అధికార పగ్గాలు అందుకుంది. 

 ఈ పరాజయానికి ఆప్ స్వయంకృతాపరాథమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరాజయంతో ఆప్ తాను స్వయంగా ఓడిపోవడమే కాకుండా.. ఇండియా కూటమి ఐక్యతను కూడా ప్రశ్నార్దకం చేసింది.
మిత్రధర్నాన్ని పాటించడానికి అహంకారంతో అంగీకరించకపోవడం కారణంగా, అంటే కాంగ్రెస్ తో పొత్తుకు నిరాకరించడం కారణంగా ఆప్ కనీసం 14 స్థానాలలో స్వల్న తేడాతో ఓడిపోయింది. ఆప్ పార్టీకి పోలైన ఓట్ల శాతం చూస్తే ఇది స్పష్టంగా అర్ధమౌతుంది. కాంగ్రెస్ కు పోలైన 7 శాతం ఓట్లు ఆప్ ఓటమిని లిఖించాయి.  అన్నిటికీ మించి.ఈ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ క్రేజీవాల్,ఆ పార్టీ కీలక నేత, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా పరాజయం పాలయ్యారు.  ఢిల్లీలో దెబ్బతిన్న రహదారులు,  ప్లై ఒవర్లపై గుంతలు,  తాగునీటి సమస్య .యమున జలాలను శుద్ధి చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించడం, ఎన్నికలకు ముందు ఆ యమునా జలాలను కలుషితం చేస్తున్నది హర్యానాలోని బీజేపీ సర్కార్ అంటూ ఆరోపణలు చేసి అభాసుపాలు కావడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అలాగే ఢిల్లీలో పేరుకుపోతున్న చెత్త కూడా ఆప్ ను ప్రజలు ఊడ్చేయడానికి ఒక కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇప్పటి వరకూ ఆప్ తన పరాజయాన్ని తానే ఎలా శాశించుకుందో చెప్పుకున్నాం. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యానికి   పకడ్బందీ వ్యూహాలతో, ప్రణాళికా బద్ధంగా  బీజేపీ ఎలా చెక్ పెట్టిందో చెప్పుకుందాం. అవినీతిపై అలుపెరుగని పోరాటం అంటూ మొదలైన కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. ఆ దిశగా గత పదేళ్లుగా అడుగులు వేశారు. పంజాబ్ లో అధికార పగ్గాలు ఆప్ చేతికి దక్కాయి. కానీ బీజేపీ ఆయన ఆశలకు, ఆకాంక్షలకు కళ్లెం వేసింది.  సొంత రాష్ట్రంలోనే ఆప్ ను ఓడించింది. ఇందు కోసం ఆప్ లో చీలిక తీసుకువచ్చింది. పార్టీ నేతలను, క్యాడర్ ను పట్టించుకోకుండా వ్యవహరించిన కేజ్రీవాల్ పై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యేలా చేసింది. ముఖ్యంగా ఒకప్పుడు కేజ్రీవాల్ పార్టీలో కీలకంగా ఉన్న స్వాతి మలివాల్..ఆయనకు బద్ధ వ్యతిరేకిగా మారారు.  ఆప్ నాయకుడు, కేజ్రీవాల్ సన్నిహితుడు తనపై దాడికి పాల్పడినా కేజ్రీవాల్ పట్టించుకోకపోవడమే స్వాతి మలివాల్  పార్టీలో రెబల్ గా మారడానికి కారణం.  మౌలికసదుపాయాలు కల్పించడంలో విఫలమైన క్రేజీ వాల్ అనే నినాదాన్ని హైలైట్ చేసారు. క్రేజీవాల్ ఓటమిని సోషల్ మీడియాలో మహాభారతం లో "ద్రౌపతి వస్త్రాపహరణం"పోస్టర్ పెట్టి తన ఆక్రోశాన్ని తీర్చుకున్నారంటే పార్టీలో ఆయన పట్ల ఎంత వ్యతిరేకత గూడు కట్టుకుందో అర్దం చేసుకోవచ్చు. అంతే కాదు కేజ్రీవాల్ అహంకారాన్ని రావణాసురుడి గర్వంతో పోల్చారు. 
అధికార,ధన దాహం, అవినీతి ఆప్ నైజం అంటూ బీజేపీ చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలోకి వెళ్లిపోయింది. కేజ్రీవాల్ గురువు, అవినీతి వ్యతిరేక ఉద్యమ సారథ, సామాజిక ఉద్యమ కారుడు అన్నాహజారే కూడా ఆప్ పరాజయాన్ని స్వాగతించారు. ఇలా అన్ని వర్గాలలోనూ ఆప్ ప్రతిష్ట మసకబారింది. అందుకే మూడు సార్లు ముఖ్యమంత్రిగా  పని చేసిన క్రేజీవాల్  ప్రస్థానం ఒక సామాన్యుడు పర్వేజ్ శర్మ చేతిలో 1844 ఓట్ల తేడాతో ఒటమిపాలయ్యారు.   సొంత నియోజకవర్గంలో ఓటమితో ఆయన ఇక రాజకీయంగా పుంజుకోవడం కష్ట సాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఏదిఏమైనా అవినీతి నిర్మూలన నినాదంతో వెలుగులోకి వచ్చి జాతీయ పార్టీగా అవతరించి,ఆ అవినీతీ లోనే  క్రేజీవాల్,ఆయన ప్రభుత్వం కొట్టుకుపోవడం రాజకీయ నాయకులకు,పార్టీలకు ఒక గుణపాఠంగా మిగులుతుందన్నడంలో సందేహం లేదు. 

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.