కేసీఆర్ తప్పటడుగులు..టీఆర్ఎస్ లో అంతర్మథనం !

Publish Date:Jul 6, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, దటీజ్ కేసీఆర్, మహా మేథావి. చాలా తెలివైన రాజకీయ నాయకుడు. అంతకంటే గొప్ప రాజకీయ వ్యూహకర్త. ఎంతటి రాజకీయ ఉద్దండులనైనా ఆయన ఇట్టే బుట్టలో వేసుకోగలరు. అంతేకాదు, ఎంతటివారినైనా అంతే తేలిగ్గా తీసి కరివేపాకులో కలిపేయనూ గలరు. ఇన్నెందుకు ఆయన ఘటనా ఘటన సమర్ధుడు. ఆయన రాజకీయ, విజ్ఞత, వివేచన మీద ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర లేదు. 
ఆయన ఎప్పుడు, ఎందుకు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయనతో సహా ఎవరికీ తెలియదు, కానీ, ఆయన నోటి నంచి వచ్చిన మాట రాజకీయ తుపాను సృష్టిస్తుంది. అలాగే, రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు సమ ఉజ్జీగా నిలిచే నాయకుడు మరొకరు లేరు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కంటే సీనియర్ నాయకులు ఉన్నా, ఉద్యమ నేతగా జనం ఆయన్ని ఎత్తు కుర్చీ ఎక్కించారు. సో.. ఆయనే టాలెస్ట్ లీడర్’గా చలామణి అవుతున్నారు. కానీ, అన్ని రోజులలో ఒకలా ఉండవు.నిజమే.నిన్నమొన్నటిదాకా, ఆయన తిరుగలేని నాయకుడే, అందులో  అనుమానం లేదు, అతిశయోక్తి అసలే లేదు. ఒక సంవత్సరం  క్రితం వరకు కేసీఆర్ గురించి చాలా మందికి ఉన్న అభిప్రాయం ఇదే. స్వపక్షీయులే కాదు, ప్రత్యర్ధులు కూడా అదే అనుకున్నారు. ఆయనను ఢీ’ కొనడం అయ్యే పని కాదనే నిర్ణయానికి వచ్చారు.అయితే అది నిన్నటి మాట.ఈరోజు పరిస్థితి అది కాదు. ఒక విధంగా ప్రస్తుతం అయన పరిస్థితి ఇంటా బయట ఒకేలా ఉందని అంటున్నారు. అంతేకాదు, ఆయనకు అడుగడుగునా అవరోధాలు, అవమానలే ఎదురవు తున్నాయని వాళ్ళు వీళ్ళు కాదు తెరాస నాయకులే అంటున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు. 

అవును. ఒక్క తప్పటడుగు, ఒకే ఒక్క తప్పటడుగు, అయన వ్యక్తిగత ఇమేజ్’నే కాదు, పార్టీ ఇమేజ్’ని ప్రభుత్వం ఇమేజ్’ని చివరకు రాష్ట్ర ఇమేజ్’ని కూడా డ్యామేజి చేసింది. ఒక తప్పు చేస్తే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పు వెంట తప్పు, తప్పు మీద తప్పు చేయక తప్పని అనివార్య పరిస్థితిని ఎదుర్కొనక తప్పుదు. కేసీఆర్ విషయంలో అదే జరిగింది. అదే జరుగుతోందని అంటున్నారు.  

నిజానికి, తెరాస పతనానికి 2014 లోనే తొలి బీజం  పడింది. అసెంబ్లీ ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే కేసీఆర్, చాలా స్పష్టమైన విధాన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి.... తెరాస ఇక ఎంత మాత్రం ఉద్యమ పార్టీ కాదని ప్రకటించారు.అంటే తెరాస జీవనాడిని చిదిమేశారు.  అయన తమ తప్పు లేకుండా ఇంకో చక్కని మాట కూడా సెలవిచ్చారు. ఇక పై తెరాస ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ అని, ఎలాంటి అనుమానాలకు ఆస్కారంలేని విధంగా ‘క్లియర్ కట్’గా కుండ బద్దలు కొట్టారు. ఇక ఆ తర్వాత ఏమి జరిగిందనేది, చరిత్ర. రాజకీయ పునరేకీకరణ పేరిట, ఒక్క బీజేపీ మినహా మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలను ఎగరేసుకు పోయారు. దీంతో, రాష్ట్రంలో ఇక తెరాసకు తిరుగేలేదనే అభిప్రాయం బలపcrపోయింది.  ఎనిమిదేళ్ళలో పదహారణాల రాజకీయ పార్టీ, ఇంచక్కా ఫోర్ ప్లస్ వన్ ఫ్యామిలీ పార్టీగా మారిపోయింది.

ఇక ఆ తర్వాత సహజంగానే కుటుంబ పార్టీలకు అనివార్యంగా ఉండే, కుటుంబ, వారసత్వ కలహాలు, అవినీతి ఇత్యాదులన్నీ వచ్చి చేరాయి. అయినా, తెలంగాణ ప్రజలు 2018లో తెరాసకు మరో అవకాశం ఇచ్చారు. చంద్రబాబును బూచిగా చూపించి సెంటిమెంట్’ను రెచ్చగొట్టి ఆ ఎన్నికలలో విజయం సాధించారు. 

అదొక అధ్యాయం అనుకుంటే, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో కేసీఆర్ నాయకత్వంలోనే తెరాస గెలిచినా గడచిన మూడున్నర నాలుగు సంవత్సరాలలో ఇటు పార్టీ పైన అటు ప్రభుత్వం పైనా ఆయన పట్టు తప్పింది. ఇందుకు ప్రధానంగా కుటుంబ, వారసత్వ వివాదాలే కారణంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కుటుంబంలో ‘కేటీఆర్’ను తక్షణం ముఖ్యమంత్రిని చేయాలనే వత్తిడి పెరుగుతోందని, అందుకే ముఖ్యమంత్రి తీవ్ర వత్తిడికి గురవుతున్నారాణి, కల్వకుట్ల ఫ్యామిలీ క్లోజ్ సర్కిల్స్ మీడియా సాక్షిగా బయట పెడుతున్నారు.ఈ వత్తిడి నేపధ్యంగానే ముఖ్యమంత్రి అనూహ్యంగా తప్పదు నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు.  

అలాగే, 2014లో ఉద్యమ పార్టీ కాదని  ప్రకటించడం వ్యూహాత్మక తప్పిదం అయితే, ఇప్పడు అందుకు కొనసాగింపుగా కుటుంబ పాలనను ఎస్టాబ్లిష్ చేసేందుకు, ఈటల రాజేదంర్’ పై వేటు వేయడంతో మొదలైన తప్పటడుగులు,ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.