కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చే ఏడాది నుంచే.. నిజమేనా?

Publish Date:Nov 1, 2024

Advertisement

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత వరుసగా రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుగులేని విజయాలను సాధించిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి బోల్తా పడ్డారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యం అన్నది పైపై మాటే వాస్తవంగా ఆయన దేశానికి ప్రధాని కావాలన్న ఆంక్ష, కాంక్ష తోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి, తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాల రాజకీయాలలో తలదూర్చారన్నది పరిశీలకులు విశ్లేషణ. అయితే ఆయన వ్యూహాలు వికటించాయి. ఎత్తుగడలు ఫలించలేదు. పొరుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలూ, ప్రజలే కాదు.. చివరాఖరికి కేసీఆర్ నేల విడిచి చేసిన సాముని తెలంగాణ ప్రజలే అంగీకరించలేదు. ఫలితం 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం. తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలి సారిగా బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మారిపోయారు. అయితే ఈ మార్పును కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. పార్టీ నేతల మీద కోపమో, తన మీద తనకే కోపమో.. లేక సావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన తనను ఓడించారని ప్రజలపై అలకబూనారో తెలియదు కానీ.. ఓటమి తరువాత కేసీఆర్ మరీ నల్లపూస అయిపోయారు. ఈ పదిన్నర నెలల పైచిలుకు కాలంలో ఆయన జనం ముందుకు వచ్చింది, మీడియాతో మాట్లాడింది చాలా చాలా తక్కువ. ఏదో మొక్కుబడికి ఒక సారి అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ తరువాత లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రచారం చేశారంటే చేశారనిపించుకున్నారు. అయితే లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలో కనీసం బోణీ కూడా కొట్టలేదు. పుండు మీద కారం చల్లినట్లు వరుసగా రెండో సారి కూడా జనం తిరస్కరించడంతో కేసీఆర్ పూర్తిగా అజ్ణాత వాసంలోకి వెళ్లిపోయారు.  

అయితే కేటీఆర్, హరీస్ సహా బీఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్ లేస్తే మనిషి కాదు. మళ్లీ రాజకీయంగా క్రియాశీలం అవుతారు. రేవంత్ సర్కార్ కు ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు అంటూ చెబుతూ వస్తున్నారు. అదీకాక బీఆర్ఎస్ కు కర్త, కర్మ, క్రియ వంటి కేసీఆర్ మౌనం ఆ పార్టీకి తీరని నష్టం చూకూరుస్తోంది. పార్టీ శ్రేణులు సైతం కేసీఆర్ మౌనం పట్ల అసంతృప్తితో ఉండటమే కాకుండా తరచుగా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్ ఫలానా తేదీన బాంబు పేలుస్తారు. మళ్లీ రాజకీయాలలో క్రియాశీలం అవుతారు అంటూ తేదీలు ప్రకటిస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు తేదీలను వారు ప్రకటించారు. ఆ తేదీలు వచ్చాయి. వెళ్లిపోయాయి. కానీ కేసీఆర్ మాత్రం  బయటకు రాలేదు. ఈ తరుణంలో తాజాగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ కు ముహూర్తం ప్రకటించేశారు.  ఎక్స్ వేదికగా ఆయన నిర్వహించే ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఆయనీ ప్రకటన చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన మార్గదర్శకంలోనే తాము పని చేస్తున్నామని స్పష్టం చేశారు.  

 రేవంత్‌  సర్కార్ కు కనీసం ఏడాది సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నారని వివరణ కూడా ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఆయన మళ్లీ రాజకీయాలలో యాక్టివ్ అవుతారు అని కేటీఆర్ ఒక నెటిజన్ ప్రశ్నకు సవివరంగా సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానం బానే ఉంది కానీ, పార్టీ అధినేత రేవంత్ సర్కార్ కు కొంత సమయం ఇవ్వాలని అనుకున్నప్పుడు.. కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు రేవంత్ సర్కార్ పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. సమయం ఇవ్వాలన్న కేసీఆర్ నిర్ణయంతో వీరు విభేదించారా?  లేక కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే వీరు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే.. ఆ మాత్రం దానికి కేసీఆర్ మౌనం ఎందుకు? అంటూ నెటిజనులు కేసీఆర్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  

By
en-us Political News

  
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.